Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం

ఈ ఏడాది మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మునుపటి కంటే తీవ్ర స్థాయిలో భానుడు ప్రతాపం చూపాడంతో ప్రజలతోపాటు మూగజీవాలు కూడా అల్లాడిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే చల్లని కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఈ రోజు కేరళలో అడుగుపెట్టాయి. రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా..

Monsoon: చల్లని కబురు.. కేర‌ళ‌లోకి ప్రవేశించిన రుతుపవనాలు! మరో 2 రోజుల్లోనే ఏపీకి ఆగమనం
Southwest Monsoon
Follow us

|

Updated on: May 30, 2024 | 5:27 PM

న్యూఢిల్లీ, మే 30: ఈ ఏడాది మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. మునుపటి కంటే తీవ్ర స్థాయిలో భానుడు ప్రతాపం చూపాడంతో ప్రజలతోపాటు మూగజీవాలు కూడా అల్లాడిపోయాయి. తాజాగా వాతావరణ శాఖ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే చల్లని కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రుతుపవనాలు ఈ రోజు కేరళలో అడుగుపెట్టాయి. రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మీదుగా వీచిన రెమల్ తుఫాను రుతుపవన ప్రవాహాన్ని బంగాళాఖాతం వైపు మళ్లించిందని, దీని ప్రభావంతో రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు పేర్కొంది.

కేరళతోపాటు లక్షద్వీప్‌లో రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 64.5 ఎంఎం నుంచి 115.5 ఎంఎం మ‌ధ్య వ‌ర్షపాతం న‌మోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఐఎంబీ వెల్లడించింది. కాగా ఇప్పటికే కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మన దేశ ఆర్ధిక వ్యవస్థకు రుతుపవనాలు కీలక పాత్రపోషిస్తాయి. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన 70 శాతం వర్షపాతం రుతుపవనాల ద్వారా లభిస్తుంది. సాధారణంగా ఇవి ప్రతీయేట జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. ఇక దేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారా..? జాగ్రత్త..
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం.. ప్రస్తుతం ఇలా
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు