Viral Video: బాబోయ్‌ రాకాసి వాన.. ఎయిర్‌పోర్టులో విమానం కూడా కొట్టుకుపోయిందిగా! వీడియో

యునైటెడ్ స్టేట్స్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌ పోర్టులో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. గాలివాన భీభత్సానికి ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిలిపిన విమానం కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 90 వేల పౌండ్ల బరువుతన్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ విమానం మంగళవారం ఉదయం వీసిన బలమైన గాలుల ధాటికి పక్కకు కొట్టుకుపోయింది. సాధారణంగా బలమైన గాలి వాన..

Viral Video: బాబోయ్‌ రాకాసి వాన.. ఎయిర్‌పోర్టులో విమానం కూడా కొట్టుకుపోయిందిగా! వీడియో
American Airlines
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2024 | 4:51 PM

డల్లాస్‌, మే 29: యునైటెడ్ స్టేట్స్‌లోని డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌ పోర్టులో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. గాలివాన భీభత్సానికి ఎయిర్‌పోర్టు రన్‌వేపై నిలిపిన విమానం కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 90 వేల పౌండ్ల బరువుతన్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ బోయింగ్‌ విమానం మంగళవారం ఉదయం వీసిన బలమైన గాలుల ధాటికి పక్కకు కొట్టుకుపోయింది. సాధారణంగా బలమైన గాలి వాన బీభత్సానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం.. కార్లు, బైక్‌లు వంటి వాహనాలు వరదలకు కొట్టుకుపోవడం వంటివి చూస్తుంటాం. కానీ అంత బరువున్న విమానం కొట్టుకుపోవడం ఏంటబ్బా అని ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం..

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విమాన రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఎయిర్‌పోర్ట్‌లోని సుమారు 700 విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. అక్కడ బలమైన గాలుల ధాటికి రన్‌వేపై పార్క్‌ చేసిన అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం ఒక్కసారిగా పక్కకు తోసుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విమానాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైన మరమ్మత్తులు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మంగళవారం ఉదయం టెక్సాస్, దాని పొరుగు రాష్ట్రాలలో బలమైన గాలులతో వాన భీభత్సం సృష్టించింది. D-FW విమానాశ్రయం నుంచి బయలుదేరవల్సిన పలు విమానాలు రద్దు చేశారు. టెక్సాస్ లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆరు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. టెక్సాస్ లో ఇటీవల కురిసిన తీవ్రమైన తుఫానుల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీని నుంచి కోలుకుంటున్న క్రమంలో తాజాగా మరొక తుఫాను భీభత్సం సృష్టించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!