Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dera Baba: డేరా బాబాను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ఏ నేరం చేయలేదట!

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా ఏ నేరం చేయలేదట. తన మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో నిర్దోషిగా తేల్చుతూ పంజాబ్‌- హర్యానా హైకోర్టు మంగళవారం (మే 28) తీర్పు వెలువరించింది. ఈ కేసులో డేరాబాబాతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు దోషులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కింది కోర్టు ఈ ఐదుగురిని దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును హైకోర్టు..

Dera Baba: డేరా బాబాను నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ఏ నేరం చేయలేదట!
Dera Sacha Sauda Chief Ram Rahim
Follow us
Srilakshmi C

|

Updated on: May 28, 2024 | 6:43 PM

పంజాబ్‌, మే 28: డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్ రహీమ్‌ సింగ్‌ అలియాస్‌ డేరా బాబా ఏ నేరం చేయలేదట. తన మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హత్య కేసులో నిర్దోషిగా తేల్చుతూ పంజాబ్‌- హర్యానా హైకోర్టు మంగళవారం (మే 28) తీర్పు వెలువరించింది. ఈ కేసులో డేరాబాబాతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు దోషులను కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కింది కోర్టు ఈ ఐదుగురిని దోషులుగా పేర్కొంటూ ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది.

అసలేం జరిగిందంటే..

డేరా బాబా దగ్గర మేనేజర్‌గా పనిచేసిన రంజిత్‌ సింగ్‌ 2002 జూలై 10న హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్‌పూర్‌ కొలియన్‌ గ్రామంలోని పొలాల్లో దారుణ హత్యకు గురయ్యారు. అతడు తన పొలంలో పనిచేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ కాల్పులు జరిపి హత్య చేశారు. డేరాబాబా తన ఆశ్రమంలో చేసే లైంగిక దోపిడీని వివరిస్తూ వెలువడిన లేఖ వెనుక రంజిత్‌ సింగ్‌ పాత్ర ఉందని.. ప్రతీకారంతో అతడిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపిన సీబీఐ 2007లో డేరాబాబాతో సహా ఆరుగురు నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2021 అక్టోబర్‌ 1న ప్రత్యేక CBI కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ 20 యేళ్ల జైలు శిక్ష విధించింది. డేరాబాబాపై ఈ హత్య నేరం మాత్రమే కాకుండా తన ఆశ్రంలోని ఇద్దరు మహిళా శిష్యులపై కూడా అత్యాచారం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో గత నాలుగేళ్లుగా డేరాబాబా రోహ్‌తక్‌లోని సునారియా జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

అలాగే 16 ఏళ్ల క్రితం జర్నలిస్టును హత్య చేసిన కేసులో కూడా అతను దోషిగా ఉన్నాడు. 2017 ఆగస్టులో డేరాబాబాపై అత్యాచార ఆరోపణలు రావడంతో హర్యానాలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాకాండలో 41 మంది మరణించగా.. అనేక వందల మంది గాయపడ్డారు. డేరాబాబాపై 2002 ఏప్రిల్‌లో తొలిసారి అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా సిర్సా జిల్లా న్యాయమూర్తిని మేలో హైకోర్టు ఆదేశించింది. 2002 సెప్టెంబరులో ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కేసు సీబీఐకి బదిలీ చేశారు.

ఇవి కూడా చదవండి

సీబీఐ అతడిని దోషిగా నిర్ధారించడంతో పలుమార్లు పెరోల్‌కు అప్లై చేసుకున్నాడు. తమ అనుమతి లేకుండా డేరాబాబాకు పెరోల్‌ మంజూరు చేయడానికి వీల్లేదంటూ అప్పట్లో పంజాబ్ – హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని కోరింది. జనవరి 19న డేరాబాబాకు 50 రోజుల పెరోల్ మంజూరు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ తర్వాత 2023 నవంబర్‌లో అతనికి 21 రోజుల పెరోల్ మంజూరు అయ్యింది. అదే ఏడాది జూలైలో నెల రోజులు, జనవరిలో 40 రోజుల పాటు తాత్కాలికంగా జైలు నుంచి బయటికి వచ్చాడు. ఇక అక్టోబర్ 2022లో కూడా 40 రోజులకు పెరోల్ మంజూరు అయ్యింది. ఇలా ఇప్పటి వరకు 7 సార్లు పెరోల్‌పై బయటికి వచ్చాడు. ప్రస్తుతం సాధ్వీలపై అత్యాచారం, జర్నలిస్ట్ హత్య కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.