AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బార్‌లో మద్యం నిరాకరించాడనీ.. తుపాకీతో డీజేని కాల్చి చంపిన కస్టమర్! వీడియో వైరల్

బార్‌లో మద్యం తాగేందుకు నిరాకరించాడంతో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో డీజేని కాల్చి హత్య చేశారు. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

Viral Video: బార్‌లో మద్యం నిరాకరించాడనీ.. తుపాకీతో డీజేని కాల్చి చంపిన కస్టమర్! వీడియో వైరల్
Man Shoots Dj In Rage In Bar
Srilakshmi C
|

Updated on: May 27, 2024 | 4:37 PM

Share

రాంచీ, మే 27: బార్‌లో మద్యం తాగేందుకు నిరాకరించాడంతో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో డీజేని కాల్చి హత్య చేశారు. ఈ షాకింగ్‌ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ బార్ కు సోమవారం తెల్లవారుజామున 1 గంటకు బార్‌ క్లోజ్‌ చేసిన అనంతరం నిందితుడితో సహా ఐదుగురు వ్యక్తులు బార్‌కు వచ్చారు. తమకు మద్యం అందించాలని డిమాండ్ చేశారు. అందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. దీంతో నిందితులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో షార్ట్‌లో ఉన్న ఓ వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి చేతిలో తుపాకీతో బార్‌లో డీజేగా ఉన్న శాండీ అనే వ్యక్తికి అతి సమీపంగా వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. పాయింట్‌ బ్లాంక్‌ నుంచి డీజే ఛాతిపై కాల్చడంతో.. అక్కడికక్కడే డీజే శాండీ కుప్పకూలాడు. కాల్పుల ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని వెంటనే రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న రాంచీ డీఎస్పీ, స్థానిక ఎస్‌హెచ్‌ఓ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాంచీ ఎస్‌ఎస్‌పి చందన్ సిన్హా తెలిపారు. దర్యాప్తులో భాగంగా బార్‌లోని సిబ్బందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని, అతని సహచరులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..