Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannes Film Festival: ‘కేన్స్‌’లో సంచలనం సృష్టించిన అనసూయ.. ఉత్తమ నటిగా అవార్డు!

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటింది. ఫ్రాన్స్‌లో జరిగిన 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ‘ది షేమ్‌లెస్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలో ఆమె నటనకుగాను ఈ అవార్డు వరించింది. బల్గేరియన్‌ దర్శకుడు 'కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌' ఈ మువీని తెరకెక్కించారు. ఈ మువీలో అనసూయ.. రేణుక అనే వేశ్య పాత్రలో..

Cannes Film Festival: 'కేన్స్‌'లో సంచలనం సృష్టించిన అనసూయ.. ఉత్తమ నటిగా అవార్డు!
Actress Anasuya Sengupta
Follow us
Srilakshmi C

|

Updated on: May 26, 2024 | 9:28 AM

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ వేదికపై భారతీయ సినిమా సత్తా చాటింది. ఫ్రాన్స్‌లో జరిగిన 77వ కేన్స్‌ చలనచిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించింది. ‘ది షేమ్‌లెస్‌’ అనే బాలీవుడ్‌ సినిమాలో ఆమె నటనకుగాను ఈ అవార్డు వరించింది. బల్గేరియన్‌ దర్శకుడు ‘కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌’ ఈ మువీని తెరకెక్కించారు. ఈ మువీలో అనసూయ.. రేణుక అనే వేశ్య పాత్రలో నటించింది. గత్యంతరం లేని తరుణంలో ఢిల్లీ వేశ్యాగృహంకి చేరుకుని, అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఓ పోలీస్‌ను హత్య చేసి, అక్కడి నుంచి పారిపోయి మరో వేశ్యవాటికకు చేరుతుంది. అక్కడికి బలవంతంగా తీసుకొచ్చి వేశ్యగా మార్చిన ఓ బాలికను చూసి చలించిపోయిన ఆమె.. బాలికను కాపాడిన విధానం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో వేశ్యగా ఆమె నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ చరిత్ర సృష్టించారు. ‘విధిలేని పరిస్థితుల్లో పడుపు వృత్తిని కొనసాగిస్తున్నవారికి, తమ హక్కుల కోసం గళమెత్తుతున్న అణగారిన వర్గాలకు ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా అనసూయ గళం వినిపించారు.

ఫేస్‌బుక్‌లో పరిచయం.. అంతర్జాతీయ వేదికపై మెరిపించింది

కోల్‌కతాలో జన్మించిన నటి అనసూయ.. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనసూయ 2009లో అంజన్‌ దత్‌ తెరకెక్కించిన ‘మ్యాడ్లీ బంగాలీ’తో సహాయనటిగా తొలిసారి నటించింది. తర్వాత 2013లో ముంబయిలో అడుగుపెట్టిన అనసూయ కొన్ని సినిమాల్లో పెద్దగా గుర్తింపులేని పాత్రల్లో నటించింది. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మారింది. ‘సాత్‌ ఊంఛాకే’, ‘ఫార్గెట్‌ మి నాట్‌’, ‘మసాబా మసాబా’ చిత్రాలకు పని చేశారు. యశ్‌దీప్‌ను ప్రేమించి పెళ్లిచేసుకుని గోవాలో సెటిల్‌ అయ్యారు. సినిమాలకు దాదాపు దూరంగా ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌ ద్వారా దర్శకుడు కాన్‌స్టాంటిన్‌తో అనసూయకు పరిచయం అయ్యారు. ఆయన 2020లో అనసూయని ‘ది షేమ్‌లెస్‌’ ఆడిషన్‌కి పిలవడం, ఆమె ఎంపిక కావడం రెండూ జరిగిపోయాయి. ఈ ఏడాది కేన్స్‌లో లా సినీఫ్ సెలక్షన్‌లో సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో అనే కన్నడ షార్ట్‌ ఫిల్మ్‌, బన్నీహుడ్ అనే మరో రెండు భారతీయ చిత్రాలు మొదటి, మూడవ స్థానాలను గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anasuya Sengupta (@cup_o_t)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.