AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Emanuel: చివరి చూపు కూడా దక్కలేదు.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గం గం గణేశా సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో స్నేహితుడిగా కనిపిచంనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన తాత మరణం.. చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

Jabardasth Emanuel: చివరి చూపు కూడా దక్కలేదు.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్..
Jabardast Emanuel
Rajitha Chanti
|

Updated on: May 26, 2024 | 9:34 AM

Share

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా పాపులర్ అయినవారు ఇప్పుడు సినిమాల్లో హీరోలుగా.. సహాయ నటులుగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు ఇప్పుడు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా.. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ సైతం వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న గం గం గణేశా సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో స్నేహితుడిగా కనిపిచంనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఇమ్మాన్యుయేల్ తన జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన తాత మరణం.. చివరి చూపు కూడా దక్కలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. “జబర్దస్త్ షోలోకి వచ్చిన కొత్తలో అప్పుడప్పుడే మంచి పేరు వస్తుంది. అయితే ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మా నాన్న ఫోన్ చేసి తాత చనిపోయాడని చెప్పాడు. మా తాత అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను అప్పుడు వెళ్లిపోతే జబర్దస్త్ స్కిట్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు వెళ్లలేని పరిస్థితి. పక్కకు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత కళ్లు తుడుచుకుని స్టేజి పైకి వచ్చి స్కిట్ చేశాము. ఆ స్కిట్ అద్భుతంగా వచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన స్కిట్స్ అన్నింటిలో అదే బెస్ట్. మా తాత మరణించాడనే బాధను మర్చిపోవడానికి బహుశా బాగా పెర్ఫామ్ చేశానేమో. స్కిట్ పూర్తయ్యాక ఇంటికి వెళ్తే అప్పటికే అంత్యక్రియలు ముగిశాయి. మా తాత కడసారి చూపు కూడా దక్కలేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్.

జీవితంలో ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు తప్పవని అన్నాడు. అలాంటి పరిస్థితులను దాటుకుని వచ్చాను కాబట్టే ఈరోజు ఎంతో కొంత నిలబడగల్గుతున్నాని అన్నాడు. అలాగే జబర్దస్త్ షో ద్వారా వర్షతో లవ్ ట్రాక్.. ప్రతి ఈవెంట్లో తాను వచ్చినప్పుడు వర్ష పేరు పిలవడం విని నవ్వి ఊరుకుంటున్నట్లు చెప్పాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.