Andhra Pradesh: అప్పు పైసలిస్తలేరనీ.. ఇంటికొచ్చి భార్యను ఎత్తుకెళ్లారు! ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు కాజేసి యేళ్లకు యేళ్లు ముఖం చాటేశాడు. దీంతో తమ పైకం తిరిగి చెళ్లించాలని ఓ నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అయితే ఇతగాడు రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు ఇక లాభం లేదని మాస్టర్ ప్లాన్ వేశాడు. సాధారణంగా తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ఇంట్లో విలువైన వస్తువులో, పొలాలో.. ఆస్తులో ఇలా స్వాధీనం చేసుకుంటారు. కానీ తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్ చేశారు. కానీ సదరు నిరుద్యోగి మాత్రం తన సొమ్ము వసూలు చేయడానికి ఏకంగా..
దుండిగల్, మే 26: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు కాజేసి యేళ్లకు యేళ్లు ముఖం చాటేశాడు. దీంతో తమ పైకం తిరిగి చెళ్లించాలని ఓ నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అయితే ఇతగాడు రేపు, మాపు అని తిప్పిస్తుండటంతో విసిగిపోయిన బాధితుడు ఇక లాభం లేదని మాస్టర్ ప్లాన్ వేశాడు. సాధారణంగా తీసుకున్న సొమ్ము చెల్లించకుంటే ఇంట్లో విలువైన వస్తువులో, పొలాలో.. ఆస్తులో ఇలా స్వాధీనం చేసుకుంటారు. కానీ తన కుటుంబసభ్యులతో కలిసి అతడి భార్యను కిడ్నాప్ చేశారు. కానీ సదరు నిరుద్యోగి మాత్రం తన సొమ్ము వసూలు చేయడానికి ఏకంగా తనను మోసం చేసిన వ్యక్తి భార్యను ఎత్తుకెళ్లాడు. పైగా తీసుకొన్న డబ్బులు ఇస్తేనే భార్యను వదులుతానని హెచ్చరించాడు. దీంతో లబోదిబో మంటూ సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విచిత్ర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారం ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మాగంటి లక్ష్మణరావుతో హైదరాబాద్‌కు చెందిన ఎలిజబెత్‌రాణికి 19 ఏండ్ల క్రితం వివాహమైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుందర్‌నగర్‌లో ఈ జంట కాపురం ఉంటున్నారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. ఎలిజబెత్‌రాణి స్థానిక ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది. అయితే ఆమె భర్త లక్ష్మణరావు ఏడేళ్ల క్రితం ఓయూ ప్రాంతంలోని మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత లక్ష్మణరావు దందా బయటపడటంతో పై అధికారులు అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించాడు. అతడికి ఉద్యోగం ఇప్పించకపోగా ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు లక్ష్మణరావు.
ఈ విషయం తెలుకున్న వెంకటేశ్ డబ్బుల కోసం అతడిని ఒత్తిడి చేయసాగాడు. అయితే లక్ష్మణరావు రేపు, మాపు అంటూ కాలం దాటేస్తుండటంతో చిర్రెత్తుకొచ్చిన వెంకటేశ్ కిడ్నాప్ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు మహిళల సాయంతో శనివారం ఉదయం ఎలిజబెత్‌రాణిని ఆటోలో ఎక్కించుకుని మాణికేశ్వర్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. తాను కిడ్నాపైన విషయం ఎలిజబెత్‌రాణి తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సాయంత్రానికి వెంకటేశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని, నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఇరువర్గాల మధ్య రాజీ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇరువర్గాలు పోలీసుల అదుపులోనే ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.