AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains Update: తీవ్రరూపం దాల్చుతోన్న ‘రెమాల్‌’ తుపాను.. ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో కుండపోత వాన!

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా - వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం..

AP Rains Update: తీవ్రరూపం దాల్చుతోన్న 'రెమాల్‌' తుపాను.. ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో కుండపోత వాన!
AP Rains Update
Srilakshmi C
|

Updated on: May 26, 2024 | 8:49 AM

Share

విశాఖపట్నం, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల వీసే అవాకశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో మే 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగ ఆవర్తనం.. కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తుఫాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

తుఫాను ప్రభావం వల్ల శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అనంతపురంలో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మి.మీ.లు వర్షపాతం నమోదైంది. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో 72.2 మి.మీ.లు, కనగానపల్లి మండలంలో 63 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వరుసగా కురుస్తున్న వర్షాల ధాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి వచ్చిన పంట వర్షం పాలు కావడంతో రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్