Andhra Pradesh: గాఢ నిద్రలో భార్య.. గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపిన భర్త..!

నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. దీంతో కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: గాఢ నిద్రలో భార్య.. గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపిన భర్త..!
Murder
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 26, 2024 | 10:51 AM

నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. దీంతో కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన సుగుణమ్మ (48), వడ్డే రమణ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. త్రాగుడుకు బానిసగా మారి రమణ, ప్రతి నిత్యం పుటుగా మద్యం సేవించి, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో తరచుగా గొడవ దిగుతున్నాడు. మద్యం మానిపించేందుకు కుటుంబసభ్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులందరూ అతన్ని ఇంటి నుంచి దూరంగా ఉంచారు. అయితే గత రాత్రి పూటుగా మద్యం సేవించిన కిరాతకుడు రమణ ఇంటికి వచ్చి భార్య సుగుణమ్మతో ఘర్షణ పడ్డాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన రమణ, నిద్రిస్తున్న భార్యను తెల్లవారు జామున గొడ్డలితో తల భాగంపై విచక్షణా రహితంగా నరికి దారుణ హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నాడు.

మహిళా దారుణ హత్య సమాచారం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ గోపినాథ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రమణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..