Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.

కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టుకు మామిడికాయలు కాసాయి. వేపచెట్టుకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న మామిడి కాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు.

Viral Video: బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు.. వీడియో.

|

Updated on: May 28, 2024 | 7:29 PM

కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టుకు మామిడికాయలు కాసాయి. వేపచెట్టుకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న మామిడి కాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు.

రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వింతను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ పేర్కొన్నారు. వేపచెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయింది అని రాసుకొచ్చారు. అంతే కాకుండా ఎంతో ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతం అని పోస్టు చేశారు. అంతే కాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు. అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేపచెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయని, వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే పేపకొమ్మపై మామిడి పూత పడడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వృక్షశాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles