India Border: భారత సరిహద్దు వెంబడి చైనా కుటిల యత్నాలు.. పుట్టగొడుగుల్లా సైనిక గ్రామాలు!

డ్రాగన్‌ కంట్రీ కంత్రి పనులకు అడ్డుకట్ట పడటంలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు అరుణాచల్‌పై అడపాదడపా వాతం పట్టుకుని, మూర్ఛరోగిలా గిలాగిలా కొట్టుకోవడం చైనాకు అలవాటే పోయింది.

India Border: భారత సరిహద్దు వెంబడి చైనా కుటిల యత్నాలు.. పుట్టగొడుగుల్లా సైనిక గ్రామాలు!
India China Border
Follow us
Balaraju Goud

|

Updated on: May 29, 2024 | 1:34 PM

డ్రాగన్‌ కంట్రీ కంత్రి పనులకు అడ్డుకట్ట పడటంలేదు. ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం, హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు అరుణాచల్‌పై అడపాదడపా వాతం పట్టుకుని, మూర్ఛరోగిలా గిలాగిలా కొట్టుకోవడం చైనాకు అలవాటే పోయింది. నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత హిందీ-చీనీ భాయీభాయీ అంటూ చాచానెహ్రూ ఇచ్చిన నినాదం.. ఆ తర్వాత వన్‌సైడ్‌ లవ్వుగా మిగిలిపోయింది.

రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు వివాదం కారణంగా 1962లో చైనాతో నేరుగా యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. టిబెట్‌తోపాటు అరుణాచల్ కూడా తమదే అంటూ తమ ఇంటర్నేషనల్ మ్యాపుల్ని చూపించేది. ఇక్కడ భారత దేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉన్న తవాంగ్‌ ఉత్తర భాగం కూడా తమదేనని చెప్పుకునేది చైనా. 1962 యుద్ధంలో గెలిచినా తవాంగ్‌ నుంచి వెనక్కు వెళ్లిపోయింది చైనా. ఆ తర్వాత భారత్ ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించింది.

అయితే తాజాగా భారత్‌తో సరిహద్దుకు సమీపంలో డ్యూయల్ యూజ్ గ్రామాలను నిర్మించడంలో చైనా బిజీగా ఉంది. ఇది కాకుండా, సైనిక సౌకర్యాల నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది కంత్రీ కంట్రీ. నిర్జనమైన, ఎవరు చేరుకోలేని హిమాలయాలలో, చైనా భారతదేశంతో తీవ్ర వివాదాస్పద సరిహద్దులో వందలాది గ్రామాలను నిర్మిస్తోందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (CSIS) మే 16న ఒక కొత్త నివేదిక పేర్కొంది. జియోస్పేషియల్ డేటా ప్రొవైడర్ సెంటినెల్ హబ్ నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు 2022 – 2024 మధ్య దాని విస్తరణను చూపుతున్నాయి న్యూస్‌వీక్ పేర్కొంది.

భారత్‌ విషయంలో చైనా తన దమననీతిని ప్రదర్శిస్తునే ఉంది. ఇటీవల విడుదల చేసిన 2023 ప్రామాణిక మ్యాప్‌లో మొత్తం అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం, అక్సాయ్‌ చిన్‌ ప్రాంతమంతా తమ భూభాగమని చైనా ప్రకటించుకుంది. ఆగస్టు 28న విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. 1962 యుద్ధంలో ఆక్రమించుకున్న అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం తమదని చైనా పేర్కొంది. అంతే కాదు తైవాన్‌, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని కూడా తమ భూభాగమేనని మ్యాప్‌ ద్వారా చైనా చూపింది. చైనా సర్వేయింగ్‌, మ్యాపింగ్‌ పబ్లిసిటీ డే వేడుకల్లో భాగంగా చైనా ఈ మ్యాప్‌ విడుదల చేసింది. మరో వైపు అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పుడూ తమ భూభాగమేనని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని అనేక సందర్భాల్లో భారత్‌ స్పష్టం చేసింది.

కానీ తాజాగా CSIS నివేదిక ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో సైనిక, ద్వంద్వ వినియోగ గ్రామ మౌలిక సదుపాయాల విస్తరణను చేపట్టినట్లు వెల్లడించింది. ఇది యారోతో పాటు జువాంగ్నాన్, మజిదున్‌కున్, కుయికియోంగ్‌మెన్‌లలో సైనిక సౌకర్యాలను విస్తరించినట్లు వెల్లడించింది. అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగమైన ప్రాంతం. అయితే చైనా దానిని తమ భూభాగంగా పేర్కొంటోంది. గ్రేజోన్ వ్యూహంతో సరిహద్దులో చైనా గ్రామాలను నిర్మిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రహస్యంగా దూకుడు సైనిక దళాలను ఈ ప్రాంతంలో మోహరించవచ్చని హెచ్చరించారు.

సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ 2018 – 2022 మధ్య, చైనా 624 ‘జియోకాంగ్’ గ్రామాలను నిర్మించిందని, ఇక పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. భారత సరిహద్దులో సైనికుల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. డిసెంబర్ 2020లో చైనా, భారత్ సైనికుల మధ్య యుద్ధం జరిగింది. 1962లో సరిహద్దు విషయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగింది. గత మూడేళ్లుగా ఘర్షణలు కూడా పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న సైనికీకరణ కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకుంటోంది.

సరిహద్దు దగ్గర వేగంగా అభివృద్ధి చెందడం చైనా మౌలిక సదుపాయాల కల్పనకు నిదర్శనం. గతేడాది యారావో సమీపంలో కొత్త రోడ్డు, రెండు హెలిప్యాడ్‌లు కూడా నిర్మించారు. 3,900 మీటర్ల ఎత్తులో ఉన్న యారావోలో కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున, చైనా 2022 డిసెంబర్ నాటికి కొత్త భవనాలను నిర్మించగలిగిందని నివేదిక పేర్కొంది. టిబెటన్, హాన్ జనాభా కలయికతో చైనా సరిహద్దు ప్రాంతాలలో జనాభాను కూడా మారుస్తోందని నిపుణులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..