AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ‘పంత్.. నువ్వొక స్టుపిడ్’.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రిషబ్ పంత్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా 4వ టెస్టు మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ ఆడిన తీరుపై సునీల్‌ గవాస్కర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లైవ్ మ్యాచ్ లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

IND vs AUS: 'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సునీల్ గవాస్కర్.. వీడియో వైరల్
Sunil Gavaskar, Rishabh Pant
Basha Shek
|

Updated on: Dec 28, 2024 | 5:54 PM

Share

గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బాలో రిషబ్ పంత్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ అందరికీ గుర్తుంటుంది. తన మెరుపు ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాకు విజయాన్ని అందించిన రిషబ్ పంత్.. సిరీస్ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ టూర్‌లోనూ పంత్‌ నుంచి అదే విధమైన ప్రదర్శన ఆశించారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో పంత్‌ ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఆడిన అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ అనవసర షాట్లు ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నాడీ డ్యాషింగ్ ప్లేయర్. ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లోనూ పంత్ అదే బాధ్యతా రహితమైన షాట్‌ను ఆడి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇది జట్టును ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, కామెంటేటర్ గా వ్యవహరిస్తోన్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు కోపం తెప్పించింది. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 37 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జట్టుకు అవసరమైన సమయంలో పంత్ అనవరసర స్కూప్ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అంతకు ముందు బంతిని కూడా ఫైన్ లెగ్ మీదుగా పిక్-అప్ ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ సక్సెస్ కాలేదు. ఆ తర్వాతి బంతితోనూ అదే ప్రయత్నం చేసిన పంత్ మళ్లీ ర్యాంప్ షాట్ ఆడాడు. కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలి డీప్ థర్డ్ మ్యాన్ వద్ద నిలబడి ఉన్న నాయన్ లియాన్ వద్దకు వెళ్లింది.

రిషబ్ పంత్ ఆడిన ఈ బాధ్యతారహిత షాట్‌ని చూసిన సునీల్ గవాస్కర్ లైవ్ మ్యాచ్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరుష పదుజాలంతో పంత్ పై విరుచుకు పడ్డాడు. ‘ఇద్దరు ఫీల్డర్లు డీప్ థర్డ్ మ్యాన్ వద్ద నిలబడి ఉన్నప్పుడు అలాంటి షాట్ ఎలా ఆడతారు. ఆఖరి బంతితోనూ అదే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. మరోసారి అదే షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నావు. ఇది మీ సహజమైన ఆట అని చెప్పలేము. ఇది మీ గేమ్ ఏ మాత్రం కాదు. పరిస్థితిని అర్థం చేసుకుని షాట్ సెలెక్షన్ చేసుకోవాలి’ అని పంత్ పై మండిపడ్డాడు సన్నీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..