Amit Shah: సడెన్‌గా ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అసలు విషయం ఏంటంటే..

లోక్ సభ ఎన్నికల సంగ్రామం చివరి అంకానికి చేరుకుంది.. జూన్ 1న ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.. ఈ క్రమంలో అగ్రనేతలందరూ చివరి దశ ప్రచారంలో హైస్పీడుతో దూసుకెళ్తున్నారు. మే30న గురువారం సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Amit Shah: సడెన్‌గా ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అసలు విషయం ఏంటంటే..
Amit Shah
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2024 | 1:29 PM

లోక్ సభ ఎన్నికల సంగ్రామం చివరి అంకానికి చేరుకుంది.. జూన్ 1న ఏడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.. ఈ క్రమంలో అగ్రనేతలందరూ చివరి దశ ప్రచారంలో హైస్పీడుతో దూసుకెళ్తున్నారు. మే30న గురువారం సాయంత్రంతో చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో మూడోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు ఓ వైపు ప్రధాని నరేంద్రమోదీ.. మరోవైపు అమిత్ షా వ్యూహాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సడెన్ గా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పర్యటించనున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ముగిశాక అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. అమిత్ షా గురువారం రాత్రి 7:30 కు తిరుమల వకుళ మాత గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రాజ్ కోట్ కు బయలుదేరుతారు.

అయితే, అమిత్ షా కూటమి, బీజేపీ నేతలను కలుస్తారా..? లేదా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.. అమిత్ షా రాక నేపథ్యంలో తిరుమలలో పకడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.

ఇదిలాఉంటే.. ఎన్నికల ప్రచారం తర్వాత ప్రధాని మోదీ సైతం తమిళనాడులోని వివేకానంద రాక్ మెమోరియల్‌లో 48 గంటల ఆధ్యాత్మిక ధ్యానం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే.. ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు చేరుకోనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..