Andhra Pradesh Politics: ఫలితాలకు ముందే పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదుగా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామం ముగిసినా.. గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. కౌంటింగ్‌కు ఇంకా ఆరు రోజుల టైమ్ ఉండటంతో అటు పార్టీల్లో.. ఇటు ప్రజల్లో ఓటింగ్ పై తీవ్ర చర్చ కొనసాగుతోంది.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేదెవరో.. ఓడిదేవరో తేలాలంటే కౌంటింగ్ డేట్.. జూన్ 4 వరకు ఆగాల్సిందే..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంగ్రామం ముగిసినా.. గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. కౌంటింగ్‌కు ఇంకా ఆరు రోజుల టైమ్ ఉండటంతో అటు పార్టీల్లో.. ఇటు ప్రజల్లో ఓటింగ్ పై తీవ్ర చర్చ కొనసాగుతోంది.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేదెవరో.. ఓడిదేవరో తేలాలంటే కౌంటింగ్ డేట్.. జూన్ 4 వరకు ఆగాల్సిందే.. కానీ, అప్పటివరకు ఆగలేమంటున్నారు పొలిటికల్ ఫ్యాన్స్. ఫలితాలు రాకముందే తమ అభిమాన నేత గెలిచేసినట్టుగా పోస్టర్లు, స్టిక్కర్లతో ఆయా పార్టీల కార్యకర్తలు.. తెగ హడావిడి చేస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ స్టిక్కర్ల ఫైట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్టిక్కర్ల ఫైట్ జోరుగా సాగుతోంది. టోటల్ ఏపీలోనే ఆసక్తికర ఎలక్షన్ ఫైట్ పిఠాపురంలో జరిగింది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నాయకురాలు వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫలితాలకు ముందు.. మా ఎమ్మెల్యే.. పవన్ కల్యాణ్, వంగా గీత పేరుతో స్కిక్కర్లు హల్‌చల్ చేస్తున్నాయ్. పవన్ ‘మా ఎమ్మెల్యే’ అంటూ బైక్స్‌పైన… వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్లపైనా స్టిక్కర్లు వేసుకుంటూ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. అమలాపురంలో అయితాబత్తుల ఆనందరావు, పినిపె విశ్వరూప్ అభిమానుల మధ్య స్టిక్కర్ ఫైట్ నడుస్తోంది. మాఎమ్మెల్యే అంటూ.. బైక్లు, కార్లపైనే కాదు… సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపుల్లో పెద్దఎత్తున ఈ రచ్చ నడుస్తోంది.
వీడియో చూడండి..
అయితే.. ఎన్నికల ఫలితాలకు ముందే ఆయా నేతల అభిమానులు పోస్టర్లతో హడావుడి చేస్తుండటం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..