AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: ప్రభాస్ పై కిచ్చా సుదీప్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న సుదీప్.. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ మూవీలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. తాజాగా ప్రభాస్, విజయ్ దళపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Kichcha Sudeep: ప్రభాస్ పై కిచ్చా సుదీప్ ఆసక్తికర కామెంట్స్.. ఏమన్నారంటే..
Prabhas, Sudeep
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2024 | 5:47 PM

Share

కన్నడ చిత్రపరిశ్రమలో దాదాపు దశాబ్దకాలంగా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు కిచ్చా సుదీప్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న సుదీప్.. హిందీ, తెలుగు, కన్నడలో అనేక చిత్రాల్లో నటించాడు. హిందీలో పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించాడు. ఇక ఇప్పుడు కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ మ్యాక్స్. ఇప్పటికే ఈ చిత్రంలో తెలుగు, తమిళంలో సైతం విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుదీప్ ప్రభాస్, విజయ్ దళపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా ఆయన ఒకేలా ఉంటారని అన్నారు.

సుదీప్ మాట్లాడుతూ.. “ప్రభాస్ మంచి వ్యక్తి. చాలా సింపుల్ పర్సన్. ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగిస్తుంటారు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా ఆయన ఒకేలా ఉంటారు. కొంచెం కూడా గర్వం లేని వ్యక్తి” అని సుదీప్ అన్నారు. ఆ తర్వాత విజయ్ దళపతి గురించి మాట్లాడుతూ.. “విజయ్ తో నేను గతంలో కలిసి వర్క్ చేశాను. మా కాంబోలో పులి (2015) విడుదలైంది. ఆ సమయంలో మేమిద్దరం పలు విషయాల గురించి చర్చించుకునేవాళ్లాం. ఆయన ఎన్నో గొప్ప కలలు కంటుంటారు. వాటిని సాధించేందుకు శ్రమిస్తుంటారు. ఏది ? ఎప్పుడు ? ఎలా ? సాధించాలనే విషయాల్లో ఆయన స్పష్టతతో ఉంటారు. ఆయనకు ఉన్నంత క్లారిటీ ఎవరికీ ఉండదు ” అని అన్నారు.

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ‘పులి’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘విజయ్ చాలా ఏళ్లుగా ఓ పెద్ద సినిమా తీయాలనుకున్నాడు. నా కోసం ఓ పాత్ర కూడా సిద్ధం చేశాడు. ఆ పాత్ర కోసం నన్ను అడిగినప్పుడు, అది నాకు అవసరమా లేదా అని ఆలోచించకుండా, నేను ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావాలని, విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్నానను.. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.