Match Fees Hike : మహిళా క్రికెటర్ల దశ తిరిగింది.. బీసీసీఐ బంపర్ ఆఫర్..మ్యాచ్ ఫీజులు డబుల్ ధమాకా
Match Fees Hike : బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లకు, పురుష క్రికెటర్లతో సమానమైన గౌరవం, వేతనం కల్పించాలనే లక్ష్యంతో మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇటీవల భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో ఆ విజయానికి గుర్తింపుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Match Fees Hike : బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లకు, పురుష క్రికెటర్లతో సమానమైన గౌరవం, వేతనం కల్పించాలనే లక్ష్యంతో మ్యాచ్ ఫీజులను భారీగా పెంచింది. ఇటీవల భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న నేపథ్యంలో ఆ విజయానికి గుర్తింపుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటివరకు తక్కువ మొత్తంతో సరిపెట్టుకున్న ప్లేయర్ల ఆదాయం ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగనుంది.
కొత్త నిబంధనల ప్రకారం సీనియర్ మహిళా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడే ప్లేయర్లకు ప్రతి రోజూ రూ.50,000 నుండి రూ.60,000 వరకు అందనుంది. గతంలో ఇది కేవలం రూ.20,000 మాత్రమే ఉండేది. అంటే ఇప్పుడు సుమారు మూడు రెట్లు పెరిగిందన్నమాట. ఇక రిజర్వ్ ప్లేయర్ల విషయానికి వస్తే, వారికి కూడా భారీ ఊరట లభించింది. గతంలో కేవలం రూ.10,000 వచ్చే చోట, ఇప్పుడు రోజుకు రూ.25,000 చెల్లించనున్నారు. వన్డేలు, మల్టీ డే మ్యాచులకు ఈ ఫీజులు వర్తిస్తాయి. అలాగే టీ20 ఫార్మాట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న వారికి ప్రతి మ్యాచ్‌కు రూ.25,000, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 అందుతాయి.
ఒక మహిళా క్రికెటర్ ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్ల దేశవాళీ క్రికెట్ ఆడితే, ఆమె సుమారు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం సీనియర్లే కాకుండా, జూనియర్ క్రికెటర్లకు (అండర్-23, అండర్-19) కూడా మేలు జరిగింది. వీరికి రోజుకు రూ.25,000 చొప్పున ఫీజు లభిస్తుంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలకు క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకోవడానికి మంచి ఆర్థిక భరోసా లభించినట్లయింది.
కేవలం ఆటగాళ్లకే కాకుండా మైదానంలో కష్టపడే అంపైర్లు, మ్యాచ్ రెఫరీల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. లీగ్ మ్యాచ్‌ల కోసం రోజుకు రూ.40,000, నాకౌట్ మ్యాచ్‌ల కోసం రోజుకు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఇవ్వనున్నారు. ఉదాహరణకు రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తే, ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ నిర్ణయాల వల్ల భారత దేశవాళీ క్రికెట్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఇది భవిష్యత్తులో మరిన్ని ప్రపంచకప్‌లను గెలవడానికి దోహదపడుతుందని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




