Rajinikanth: రజినీకాంత్ సరసన క్రేజీ హీరోయిన్.. ఎన్నాళ్లకు మరో ఆఫర్ అందుకుంది..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెట్టైయాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజినీ.. ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ జైలర్ 2 పై క్రేజీ అప్డేట్ వచ్చింది.

Rajinikanth: రజినీకాంత్ సరసన క్రేజీ హీరోయిన్.. ఎన్నాళ్లకు మరో ఆఫర్ అందుకుంది..
Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 28, 2024 | 6:06 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ చివరిసారిగా వెట్టైయాన్ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. దర్శకుడు జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రజినీ సరసన మంజు వారియర్ కథానాయికగా నటించింది. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం రజినీ లోకేష్ ద‌ర్శ‌క‌త్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రజినీ కెరియర్ లో 171వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి 2025 నాటికి పూర్తవుతుందని టాక్.

ఆ తర్వాత డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్ 2లో నటించనున్నాడు రజినీ. జైలర్ సూపర్ హిట్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో రజినీకి జోడిగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మిల్కీబ్యూటీ తమన్నా సైతం ఈ చిత్రంలో నటించనుందని టాక్. కేజీఎఫ్ సినిమాతో స్టార్ డమ్ అందుకుంది శ్రీనిధి శెట్టి. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేయడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.

ఇవి కూడా చదవండి

అంతకుముందు విక్రమ్ చియాన్ సరసన కోబ్రా మూవీతో తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది శ్రీనిధి శెట్టి. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. . కూలీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత జైలర్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!