Keerthy Suresh: స్టార్ హీరో భార్యతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
సాధారణంగా సినిమా షూటింగుల్లో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. కానీ, ఒక స్టార్ హీరో భార్య, అగ్ర హీరోయిన్‌తో కలిసి పోటీపడి మరీ స్టెప్పులేస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. తాజాగా నెట్టింట ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఒక స్టార్ హీరో ..

సాధారణంగా సినిమా షూటింగుల్లో హీరోయిన్లు డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. కానీ, ఒక స్టార్ హీరో భార్య, అగ్ర హీరోయిన్‌తో కలిసి పోటీపడి మరీ స్టెప్పులేస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. తాజాగా నెట్టింట ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఒక స్టార్ హీరో భార్య, తన ఫ్రెండ్ అయిన ఫేమస్ హీరోయిన్‌తో కలిసి అదిరిపోయే లెవల్‌లో డ్యాన్స్ చేసింది. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్, వారు వేసిన గ్రేస్ ఫుల్ స్టెప్పులు చూస్తుంటే ప్రొఫెషనల్ డ్యాన్సర్లకు ఏమాత్రం తక్కువ కాదనిపిస్తోంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఆమెతో కలిసి చిందేసిన ఆ స్టార్ వైఫ్ ఎవరనేది ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ స్టార్ వైఫ్, ఆ హీరోయిన్ కేవలం వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ చాలా మంచి స్నేహితులు. సదరు హీరో నటించిన పలు సినిమాల్లో ఆ హీరోయిన్ నటించడం వల్ల వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా ఫ్యామిలీ ఫంక్షన్లలో మరియు వేడుకలలో వీరు కలిసి కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఏకంగా ఒక పాపులర్ సాంగ్‌కు డ్యాన్స్ వీడియో చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కేవలం సరదా కోసం చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Keerthy N Nani With Wife
వీడియోలో సదరు హీరోయిన్ తన ఎనర్జీతో ఆకట్టుకోగా, స్టార్ హీరో భార్య మాత్రం తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో నటించకపోయినప్పటికీ, తన భర్త సినిమాల ప్రమోషన్లలో, సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. వీరిద్దరి డ్యాన్స్ చూసిన నెటిజన్లు “అక్కా.. మీరు హీరోయిన్ అయిపోవచ్చు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ డ్యాన్స్ వీడియోలో ఉన్నది మరెవరో కాదు.. నేచురల్ స్టార్ నాని భార్య అంజన యలవర్తి, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్! వీరిద్దరూ కలిసి దసరా సినిమాలోని ‘చంకీల అంగీలేసి..’ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు.
#KeerthySuresh lighting up the dance floor at her friend’s wedding! 💃✨ pic.twitter.com/J0ktWEangr
— Chennai Times (@ChennaiTimesTOI) December 22, 2025
నాని, కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’, ‘దసరా’ వంటి హిట్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ చనువుతోనే అంజన, కీర్తి సురేష్ మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు వీరిద్దరి డ్యాన్స్ వీడియో చూసి నాని అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా తారలు, వారి కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఇలాంటి సరదా క్షణాలు అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కీర్తి సురేష్ ఎనర్జీకి తోడు అంజన గ్రేస్ తోడవ్వడంతో ఈ వీడియో ప్రస్తుతానికి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. నాని భార్యలోని ఈ కొత్త యాంగిల్ చూసి అందరూ షాక్ అవుతున్నారు!




