బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్‌కు భిన్నంగా షాలిని పాండే కెరీర్ సాగుతోంది. అర్జున్ రెడ్డి బ్లాక్‌బస్టర్‌తో ఎంట్రీ ఇచ్చినా, ఆ తర్వాత పలు భాషల్లో అవకాశాలు వచ్చినా ఆమెకు పెద్ద బ్రేక్ రాలేదు. రణ్వీర్ సింగ్‌తో జయేష్ భాయ్ జోర్దార్ కూడా నిరాశపర్చడంతో, ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే చురుగ్గా ఉన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు, ఆ స్టార్‌ను లేదా కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ షాలిని పాండే విషయంలో మాత్రం అలా జరగలేదు. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా, ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, 118, 100% కాదల్ లాంటి సినిమాల్లో అవకాశాలు రావడంతో షాలిని స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావించారు. అయితే, అదే స్పీడ్‌ను కొనసాగించడంలో ఆమె విఫలమయ్యారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా, స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ దొరకలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించారు.
మరిన్ని వీడియోల కోసం :
బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

