India vs NZ 3rd ODI: టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా? కివీస్ దూకుడుకు భారత్ దగ్గర సమాధానం ఉందా?
India vs NZ 3rd ODI: భారత జట్టుకు తన సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది. మార్చి 2019 తర్వాత ఇప్పటివరకు టీమిండియా స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు. అప్పట్లో ఆస్ట్రేలియాపై తలపడినప్పుడు మాత్రమే సిరీస్ కోల్పోయింది. అయితే ఇప్పుడు ఆ ఐదేళ్ల నాటి అజేయ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.

India vs NZ 3rd ODI: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. రేపు (ఆదివారం, జనవరి 18) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగబోయే మూడో వన్డే ఇరు జట్లకు చావో రేవో లాంటిది. వడోదరలో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా గెలవగా, రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో కివీస్ పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో రేపటి మ్యాచ్‌లో గెలిచిన వారే సిరీస్ విజేతలుగా నిలుస్తారు. మరి టీమిండియా తన కోటను కాపాడుకుంటుందా? లేక న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.
భారత జట్టుకు తన సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది. మార్చి 2019 తర్వాత ఇప్పటివరకు టీమిండియా స్వదేశంలో ఒక్క వన్డే సిరీస్ కూడా ఓడిపోలేదు. అప్పట్లో ఆస్ట్రేలియాపై తలపడినప్పుడు మాత్రమే సిరీస్ కోల్పోయింది. అయితే ఇప్పుడు ఆ ఐదేళ్ల నాటి అజేయ రికార్డుకు ముప్పు పొంచి ఉంది. అటు న్యూజిలాండ్ జట్టుకు కూడా ఇది చారిత్రాత్మక అవకాశం. 1989 నుంచి కివీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్నప్పటికీ, ఇక్కడ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఒకవేళ రేపు గెలిస్తే, కివీస్ కెప్టెన్, జట్టు చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇది అగ్నిపరీక్ష. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు కొన్ని చేదు జ్ఞాపకాలను చవిచూసింది. శ్రీలంకలో వన్డే సిరీస్ ఓడిపోవడం, స్వదేశంలో టెస్టు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవ్వడం వంటివి గంభీర్ నాయకత్వంపై విమర్శలకు తావిచ్చాయి. రేపు గనుక సిరీస్ చేజారితే, గంభీర్ ఖాతాలో మరో అవాంఛిత రికార్డు చేరుతుంది. కాబట్టి కోచ్‌గా ఆయన రేపటి మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు.
రెండో వన్డేలో భారత్ ఓటమికి ప్రధాన కారణం న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ సెంచరీ మాత్రమే కాదు, మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లను కివీస్ సమర్థవంతంగా ఎదుర్కోవడం. ముఖ్యంగా భారత బ్యాటర్లు కూడా స్పిన్ బౌలింగ్‌లో తడబడుతున్నారు. స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలమవుతూ అనవసర ఒత్తిడికి గురవుతున్నారు. ఇండోర్ స్టేడియం బౌండరీలు చాలా చిన్నవి. ఇక్కడ బౌలర్లకు సహాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాటర్లు రెచ్చిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్ల పాత్రే కీలకం కానుంది.
భారత బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ, ఫీల్డింగ్, బౌలింగ్‌లో చిన్న తప్పులు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కివీస్ జట్టు అటాకింగ్ గేమ్ ఆడుతోంది. ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తుండటంతో క్రికెట్ అభిమానులకు రేపు పసందైన వినోదం గ్యారెంటీ. భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడితేనే ఈ సిరీస్ మన సొంతమవుతుంది.
చెల్లించుకోక తప్పదు. కివీస్ జట్టు అటాకింగ్ గేమ్ ఆడుతోంది. ఇరు జట్లూ సమ ఉజ్జీలుగా కనిపిస్తుండటంతో క్రికెట్ అభిమానులకు రేపు పసందైన వినోదం గ్యారెంటీ. భారత ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమించి ఆడితేనే ఈ సిరీస్ మన సొంతమవుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
