టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తన పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐ సృష్టించిన అసభ్యకర వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు, లైంగిక, క్రిమినల్ బెదిరింపులు ఎదుర్కొన్న ఆమె, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించారు.