AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు సినిమాలు.. ఇప్పుడు వ్యాపారం.! ఈ బ్యూటీ డైలీ ఇన్‌కంతో ఒక ఫ్యామిలీ సెటిలైపోద్ది

సినిమా రంగంలో నిలదొక్కుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన క్రేజ్‌ను బిజినెస్‌గా మార్చుకుని సక్సెస్ అవ్వడం మరో ఎత్తు. చాలా మంది నటీనటులు తమ సంపాదనను రియల్ ఎస్టేట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు. కానీ ఓ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ ..

ఒకప్పుడు సినిమాలు.. ఇప్పుడు వ్యాపారం.! ఈ బ్యూటీ డైలీ ఇన్‌కంతో ఒక ఫ్యామిలీ సెటిలైపోద్ది
Heroinr..
Nikhil
|

Updated on: Dec 23, 2025 | 9:00 AM

Share

సినిమా రంగంలో నిలదొక్కుకోవడం ఒక ఎత్తు అయితే, వచ్చిన క్రేజ్‌ను బిజినెస్‌గా మార్చుకుని సక్సెస్ అవ్వడం మరో ఎత్తు. చాలా మంది నటీనటులు తమ సంపాదనను రియల్ ఎస్టేట్ లేదా ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెడుతుంటారు. కానీ ఓ బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మాత్రం ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో అడుగుపెట్టి కనీవినీ ఎరుగని రీతిలో రాణిస్తోంది. ముంబై లాంటి నగరాల్లో ఈమె హోటల్స్ అంటే ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈమె రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈమె వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఒక్క రాత్రికి మూడు కోట్ల ఆదాయం!

ఆమె ఎవరో కాదు, తన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. ఈమెకు ముంబైలోని దాదర్ ప్రాంతంలో 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ రూఫ్‌టాప్ రెస్టారెంట్ ఉంది. దీని పేరు ‘బాస్టియన్ ఎట్ ది టాప్’. 48వ అంతస్తులో ఉండే ఈ రెస్టారెంట్ నుంచి ముంబై నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ప్రముఖ రచయిత్రి శోభా డే ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ఆదాయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ముంబైలో ఒకే ఒక్క రెస్టారెంట్ రోజుకు రూ.2 నుంచి రూ.3 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోందని విన్నప్పుడు నేను నమ్మలేదు. స్వయంగా వెళ్లి చూస్తే అది నిజమని తెలిసింది. అక్కడ ఒక టేబుల్ వద్ద కూర్చున్న వారు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడ లంబోర్గిని, ఆస్టన్ మార్టిన్ వంటి ఖరీదైన కార్ల వరుస కనిపిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.

Bastian N Shilpa Shetty

Bastian N Shilpa Shetty

127 కోట్ల సామ్రాజ్యం

శిల్పాశెట్టి కేవలం ఒక రెస్టారెంట్‌తో ఆగిపోలేదు. రంజిత్ బింద్రా అనే వ్యాపారవేత్తతో కలిసి ‘బాస్టియన్ హాస్పిటాలిటీ’ పేరుతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది. 2025 నాటికి ఈ బ్రాండ్ విలువ దాదాపు రూ.127 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేవలం ముంబైలోనే కాకుండా బెంగళూరు, పూణే వంటి నగరాల్లోనూ ఈమె హోటల్స్ ఉన్నాయి. గతేడాది ముంబైలోని బాంద్రాలో ఉన్న పాత బాస్టియన్ బ్రాంచ్‌ను మూసివేసి, దాని స్థానంలో తన మూలాలకు గౌరవంగా ‘అమ్మకై’ అనే దక్షిణ భారతీయ వంటకాల రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా జుహులో ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో సరికొత్త హంగులతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

Shilpa Shetty

Shilpa Shetty

రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

ఈమె రెస్టారెంట్లలో లగ్జరీ ఏ స్థాయిలో ఉంటుందో రేట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెనూ ప్రకారం.. ఇక్కడ ఒక కప్పు టీ ధర దాదాపు 960 రూపాయలు. ఇక సాధారణ టోస్ట్ ధర 800 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఖరీదైన వైన్ ఆర్డర్ చేస్తే, దాని ధర అక్షరాలా లక్షన్నర రూపాయల పైమాటే. ‘ఇంకా’, ‘బ్లాండీ’ వంటి విభిన్న కాన్సెప్టులతో ఈమె తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. అయితే ఇటీవల ఈమె వ్యాపారాలపై కొన్ని వివాదాలు, ఐటీ దాడులు వంటి వార్తలు వచ్చినప్పటికీ, వ్యాపారపరంగా ఈ భామ సృష్టిస్తున్న రికార్డులు మాత్రం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!