AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.! వీడియో..

Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.! వీడియో..

Anil kumar poka
|

Updated on: Dec 28, 2024 | 5:16 PM

Share

మనం మన పనుల్లో ఎంత బిజీ గా ఉంటామో మన శరీరం కూడా అంతే బిజీ గా మనకు సహకరిస్తూ ఉంటుంది.. శరీరం అద్భుతమైంది, మహా తెలివైంది. తనను తాను కాపాడుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. ఏవైనా జబ్బులు తలెత్తుతుంటే ముందే సంకేతాలు, లక్షణాల రూపంలో హెచ్చరిస్తుంది. వాటిని గుర్తించగలిగితే తీవ్ర సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అందులో ముఖ్యమైనవి..మనము అస్సలు నిర్లక్షయంగా ఉండకూడని కొన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం.!

గుండెపోటు:
ఛాతీ బిగపట్టినట్టు, లోపలేదో నొక్కుతున్నట్టు అనిపించటం. నొప్పి పుట్టటం. ఇవి కొన్ని నిమిషాల సేపు అలాగే ఉండి పోవచ్చు. లేదూ వస్తూ పోతుండొచ్చు.
చేతుల్లో.. ముఖ్యంగా ఎడమ చేయి, భుజంలో నొప్పి. మెడ, దవడ, వీపు, కడుపులో కూడా నొప్పిగా, ఇబ్బందిగా అనిపించొచ్చు.
శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది. ఆయాసం.
తల తేలిపోతున్నట్టు, వికారంగా అనిపించటం. వాంతీ కావొచ్చు.
చెమట్లు పట్టటం
నిస్సత్తువ.
అందరికీ అన్ని లక్షణాలూ ఉండాలనేమీ లేదు. తీవ్రత కూడా ఒకేలా ఉండకపోవచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలూ లేకుండానే ఉన్నట్టుండి గుండెపోటు రావొచ్చు.

పక్షవాతం:
ఉన్నట్టుండి ముఖం, చేయి, కాలు మొద్దుబారినట్టు అనిపించటం. ముఖ్యంగా శరీరంలో ఒకవైపు బలహీనమవుతున్నట్టు, పట్టు తప్పుతున్నట్టు అనిపించటం.
అకస్మాత్తుగా మాట తడబడటం. అంతా అయోమయంగా అనిపించటం. ఎదుటివాళ్లు చెప్పేది అర్థం కాకపోవటం.
ఉన్నట్టుండి ఒక కంట్లో గానీ రెండు కళ్లలో గానీ చూపు తగ్గినట్టు అనిపించటం.
హఠాత్తుగా నడకలో తడబాటు, తల తిరుగుతున్నట్టు, పట్టు తప్పి తూలి పడిపోతున్నట్టు అనిపించటం.
ఎలాంటి కారణం లేకుండా ఉన్నట్టుండి తీవ్రమైన తలనొప్పి.

క్యాన్సర్‌:
అకారణంగా.. అదీ వేగంగా 5, అంతకన్నా ఎక్కువ కిలోల బరువు తగ్గటం.
ఆకలి మందగించటం. ఎప్పుడూ కడుపు నిండుగా ఉండటం. ముద్ద మింగుతున్నప్పుడు ఇబ్బందిగా అనిపించటం.
తీవ్ర నిస్సత్తువ.. ముఖ్యంగా క్యాన్సర్‌ వృద్ధి చెందుతున్నప్పుడు తీవ్ర అలసట తలెత్తుతుంటుంది. విశ్రాంతి తీసుకున్నా తగ్గదు.
ఎముక, వృషణాల క్యాన్సర్లలో నొప్పి తొలి సంకేతం కావొచ్చు. విడవకుండా తలనొప్పి, వెన్నునొప్పి కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు సూచిక కావొచ్చు.
మల విసర్జన పద్ధతుల్లో, మలం పరిమాణంలో మార్పులు, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, తరచూ మూత్రం రావటం.
నోట్లో చాలాకాలంగా మానకుండా పుండ్లు, తెల్లటి మచ్చలు. జననాంగాల్లో పుండ్లు, ఇన్‌ఫెక్షన్లు వేధించటం.
మూత్రంలో, మలంలో, కళ్లెలో రక్తం పడటం.
మెడ వద్ద, చంకల్లో లింప్‌ గ్రంథులు ఉబ్బటం. ఇవి రెండు వారాలైనా తగ్గకపోతే వెంటనే జాగ్రత్త పడాలి.
రొమ్ముల్లో మార్పులు, చనుమొనల నుంచి రక్తంతో కూడిన స్రావం.
విడవకుండా దగ్గు. దీంతో పాటు ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవటం, నిస్సత్తువ, ఆయాసం వంటివి కనబడితే తాత్సారం చేయ్యద్దు.
జ్వరం తగ్గకపోవటం. క్యాన్సర్‌ ఇతర చోట్లకు వ్యాపించినపుడు విడవకుండా జ్వరం వేధిస్తుంటుంది. ఇలాంటి జ్వరాలు పగటిపూట పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. రోజులో ఒకే సమయంలో తీవ్రమవుతుంటాయి కూడా.

మానసిక ఒత్తిడి:
తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, కండరాల బిగువు.
నోరు పొడిబారటం.
గుండె దడ, ఛాతీలో నొప్పి.
తీవ్ర అలసట, నిస్సత్తువ.
ఆకలి తగ్గటం లేదూ తీపి పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ అతిగా తినటం.
తరచూ జలుబు, ఫ్లూ బారిన పడుతుండటం.
పనులపై శ్రద్ధ, ఆసక్తి తగ్గటం.
మతిమరుపు.
అనవసర కోపం, ఆందోళన

ఇవి మన శరీరం మనకు ఇచ్చే సూచనలు.. బీ అలెర్ట్ అండ్ జస్ట్ ఫాలో యువర్ బాడీ సిగ్నల్స్

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.