Smuggler: డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.! వీడియో..
అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ సునీల్ యావద్.. కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ సిటీలో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. భారత్‌లో పలు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న ఇతడిని.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌యే చంపింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. అలాగే అతడిని ఎక్కడ, ఎలా చంపారో వివరించడంతో పాటు ఎందుకు చంపారో కూడా బయటపెట్టింది.
పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా అబోహర్‌కు చెందిన సునీల్ యాదవ్.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానాలకు ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చేవాడు. నకిలీ పాస్‌పోర్టులను ఉపయోగిస్తూ.. పాకిస్థాన్ ఇతర దేశాల నుంచి భారత్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. కొన్నేళ్ల క్రితం 300 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఈయన పేరు కూడా బయట పడింది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం అతడిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఈ క్రమంలోనే అతడు దుబాయ్ వెళ్లిపోయి అక్కడే ఉన్నాడు. అతడిని ఇండియా రప్పించేందుకు రాజస్థాన్ పోలీసులు.. దుబాయ్ పోలీసులతో కలిసి పని చేశారు. ఆ తర్వాత సునీల్ యాదవ్ అమెరికా వెళ్లిపోయాడు. అక్కడ కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇలా అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్‌గా మారిన ఈయన తాజాగా కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ సిటీలో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు. అయితే ఇతడిని చంపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే.
ఈ విషయాన్ని నేరుగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్, రోహిత్ గొడారాలు సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. స్టాక్‌టన్ ఏరియాలోని 6700 బ్లాక్‌లోని సునీల్ యాదవ్ ఇంట్లోకి చొరబడి మరీ కాల్పులకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. సునీల్ యాదవ్ పంజాబ్ పోలీసులతో కుమ్మక్కై తమ సోదరుడు అంకిత్ భాదు మరణానికి కారణం అయ్యాడని, అందుకే అతడిని చంపి పగ తీర్చుకున్నామని తెలిపారు. అయితే సునీల్ యాదవ్ గతంలో లారెన్స్ బిష్ణోయ్, రోహిత్ గోదారాకు సన్నిహితుడుగా కూడా ఉన్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.