Baby 81: ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.! వీడియో వైరల్.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం సంభవించిన సునామీ భారత్, ఇండోనేషియా సహా చాలా దేశాల్లో బీభత్సం సృష్టించింది. అదే సమయంలో శ్రీలంక తీరంలో రెండు నెలల చిన్నారి జయరస అభిలాష్ కొట్టుకుపోయాడు. మట్టిలో కూరుకుపోయిన ఆ చిన్నారి అదృష్టవశాత్తూ మృత్యుంజయుడిగా నిలిచాడు. ‘బేబీ 81’గా పేరొందిన ఆ సునామీ బాబు కథ తెలుసుకుందాం.
సునామీ కారణంగా శ్రీలంకలో 35 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది తమ కుటుంబాల నుంచి విడిపోయారు. అదే సమయంలో తీరంలో రెండు నెలల బాబు కొట్టుకుపోయాడు. అధికారులు, కుటుంబం అతడి కోసం మూడు రోజుల పాటు వెతికినా ఎక్కడా జాడ కనిపెట్టలేకపోయారు. ఓ ఇంటి సమీపంలో మట్టిలో కూరుకుపోయి.. చిన్నారి కదలికలను గుర్తించిన కొందరు బాబును రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతడికి నంబర్ 81 కేటాయించారు. దాంతో ‘బేబీ 81’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. కొన్ని రోజుల తర్వాత ఆ బాబు తమ కుమారుడే అంటూ తొమ్మిది కుటుంబాలు ముందుకువచ్చాయి. చిన్నారి అసలైన తల్లిదండ్రులు ఎవరనే అంశంపై కోర్టులో విచారణలు కొనసాగాయి. చివరికి డీఎన్‌ఏ పరీక్షల ద్వారా చిన్నారి జయరస అభిలాష్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ‘బేబీ 81’గా పేరొందిన చిన్నారి కథ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం 20 ఏళ్ల ఆ యువకుడు హైస్కూల్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయనున్నాడు. ప్రస్తుతం పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివేందుకు ఆసక్తిగా ఉందని అభిలాష్ తెలిపాడు.
ఆస్పత్రిలో ఉన్న తన బిడ్డ కోసం ఎంతోమంది పోటీపడ్డారనీ కోర్టు డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ ఆదేశించడంతో మిగిలిన కుటుంబాలు ముందుకురాలేదనీ అభిలాష్ తండ్రి మురుగుపిళ్లై అన్నారు. అప్పుడే అతడు తన కుమారుడేననే నమ్మకం కలిగిందనీ ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వచ్చాయనీ తెలిపారు. నాడు తమ ఆనందానికి అవధుల్లేవనీ అయితే.. స్కూల్లో అభిలాష్‌ను ‘బేబీ 81’గా తోటి విద్యార్థులు ఆట పట్టించడంతో అతడు కాస్త ఇబ్బందికి గురయ్యాడనీ చెప్పారు. ఆ తర్వాత తన ఆత్మస్థైర్యాన్ని మరింత బలంగా మార్చుకున్నాడు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.