Meal Maker Biryani: మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!

మీల్ మేకర్‌తో స్నాక్స్, కర్రీలు, రైస్ ఐటెమ్స్ చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్‌తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ చలి కాలంలో వేడి వేడిగా ఏదన్నా వెరైటీగా తినాలని పిల్లలు అంటే ఆలోచించకుండా ఒక్కసారి ఇలా మీల్ మీకర్‌తో దమ్ బిర్యానీ చేయండి..

Meal Maker Biryani: మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
Meal Maker Biryani
Follow us
Chinni Enni

|

Updated on: Dec 28, 2024 | 5:42 PM

మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. మీల్ మేకర్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ప్రోటీన్, ఫైబర్ కావాలి అనుకునేవారికి మీల్ మేకర్ బెస్ట్. మీల్ మేకర్‌తో స్నాక్స్, కర్రీలు, రైస్ ఐటెమ్స్ చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మీల్ మేకర్‌తో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ చలి కాలంలో వేడి వేడిగా ఏదన్నా వెరైటీగా తినాలని పిల్లలు అంటే ఆలోచించకుండా ఒక్కసారి ఇలా మీల్ మీకర్‌తో దమ్ బిర్యానీ చేయండి. సాయంత్రం పూట లైట్‌గా తినాలి అనుకుంటే ఈ బిర్యానీ తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్‌గా చాలా త్వరగా అయిపోతుంది. మరి ఈ మీల్ మేకర్‌తో బిర్యానీ ఎలా తయారు చేస్తారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మీల్ మేకర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

బాస్మతీ రైస్, మీల్ మేకర్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, పులావ్ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మకాయ, నెయ్యి, ఆయిల్.

మీల్ మేకర్ బిర్యానీ తయారీ విధానం:

ముందుగా వేడి నీటిలో మీల్ మేకర్ వేసి ఓ పది నిమిషాలు ఉంచి మెత్తగా అయ్యాక.. నీరంతా పిండి ఓ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మీల్ మేకర్‌ని మ్యారినేట్ చేయాలి. పచ్చి మిర్చి, పులావ్ దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మకాయ, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నూనె వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మరోవైపు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయించి పక్కన పెట్టుకోండి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఖాళీగా ఉండే ఓ గిన్నె తీసుకుని అందులో నీళ్లు, పచ్చి మిర్చి, పులావ్ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసి.. 80 శాతం ఉడికాక తీసి మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్‌పై వేయండి. ఆ తర్వాత పై నుంచి కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి చిన్న మంట మీద ఓ 15 నిమిషాలు కుక్ చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ దమ్ బిర్యానీ సిద్ధం.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!