Gold and Silver Prices: న్యూఇయర్ ముందు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అంతర్జాతీయ బంగారం ధరలు, భారత రూపాయి, యూఎస్ డాలర్ మధ్య మారకపు రేటు, స్థానిక డిమాండ్, ముఖ్యంగా ప్రధాన పండగల సమయాల సమయంలో, ప్రపంచ ఆర్థిక పరిణామాలు వంటి అనేక కీలక అంశాలచే ప్రభావితమవుతాయి.

Gold and Silver Prices: బంగారం , వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు 3 వేల రూపాయలకుపైగా దిగి రాగా, గత మూడు రోజుల్లో ఏకంగా 6 వేల రూపాయలకు పైగా తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి ధరల్లో కూడా భారీ మార్పు వచ్చింది. మంగళవారం ఒక్క రోజు వెండిపై ఏకంగా 18 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక డిసెంబర్ 31న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,840 వద్ద కొనసాగుతోంది.
అలాగే దేశీయంగా కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. ఇది గత మూడు రోజుల కిందటి ధరతో పోలిస్తే దాదాపు రూ.19 వేల వరకు తగ్గింది. అదే హైదరాబాద్‌లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,57,900 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Best 5 Bikes: ఈ బైక్‌కు ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కి.మీ.. ఉత్తమమైన 5 బైక్‌లు ఇవే!
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,840 ఉంది.
- విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,840 ఉంది.
- ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,340 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,990 ఉంది.
- ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,840 ఉంది.
- చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,450 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,25,990 ఉంది.
- బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,24,840 ఉంది.
దేశవ్యాప్తంగా ఒకే బంగారం రేటు ఇంకా నిర్ణయించనందున భారతదేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు మారుతూ ఉంటాయి. స్థానిక పన్నులు, నగల తయారీ ఛార్జీలతో పాటు, అనేక ఇతర అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా దక్షిణ నగరమైన చెన్నైలో బంగారం ధరలు అత్యంత వేగంగా పెరుగుతాయి. అలాగే తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: Business Idea: కేవలం రూ.50,000తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.. ఏడాదికి రూ.10 లక్షల వరకు సంపాదించండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
