AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC 2025 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

SSC Stenographer Skill Test Schedule 2025: కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనో గ్రాఫర్ పోస్టుల భర్తీకి నియాకమ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు కూడా ఇప్పటికే ముగిశాయి. తాజాగా తుది దశ అయిన స్కిల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల..

SSC 2025 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
SSC Stenographer Skill Test Schedule
Srilakshmi C
|

Updated on: Dec 31, 2025 | 6:31 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు కూడా ఇప్పటికే ముగిశాయి. తాజాగా తుది దశ అయిన స్కిల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ విడుదల చేసింది. తాజా షెడ్యూల ప్రకారం జనవరి 28, 29 తేదీల్లో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాతోపాటు రిజర్వేషన్‌ ఆధారంగా కటాఫ్‌ మార్కులను ఇటీవలే కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం స్కిల్‌ టెస్ట్‌కు గ్రేడ్‌-సికు మొత్తం 8,624 మంది, గ్రేడ్‌-డికు మొత్తం 22,456 మంది అర్హత సాధించారు.

కాగా ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 6, 7, 8, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. స్కిల్‌ టెస్ట్‌ అనంతరం మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. కాగా ఎస్‌ఎస్‌సీ ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 261 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్‌ డి పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ పోస్టుల స్కిల్‌ టెస్ట్‌ షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

CSIR యూజీసీ నెట్‌ 2025 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల.. అభ్యంతరాల చివరి తేదీ ఇదే

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్-డిసెంబర్ 2025 పరీక్షల ప్రాథమిక కీ తాజాగా విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ మేరకు ఆన్సర్ కీ తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు జనవరి 1, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో సమర్పించవచ్చు.

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్-డిసెంబర్ 2025 పరీక్షల ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
వాకింగ్ లేదా రన్నింగ్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మరికొన్ని గంటల్లో ముగుస్తు Polycet 2026 దరఖాస్తు గడువు.. లింక్
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
మ్యూజిక్ లవర్స్‌కి జాతీయ గీతం లాంటి పాట ఇది...
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రూ.5 లక్షల్లో సూపర్‌ బిజినెస్‌.. తలరాత మారిపోవాల్సిందే!
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్..మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే వీళ్లదే..1 లక్షను రూ.1.75 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.. ఇలా
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
ప్రసూతి వార్డులోని భార్యను కత్తితోపొడిచి హత్య చేసిన భర్త!
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.60 వేలు కావాలా?
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు
మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. ముందు ఈ పని చేసుకో.. జూన్‌ 14 వరకే గడువు