DSSCB 2026 Notification: పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం
DSSSB MTS Recruitment 2025-26 Notification OUT: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) నోటిఫికేషన్ విడుదల చేసింది. సక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 15, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేసన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఎక్సైజ్, ఎంటర్‌టైన్‌మెంట్ & లగ్జరీ టాక్సెస్ డిపార్ట్‌మెంట్, లేబర్, డ్రగ్స్ కంట్రోల్, ఆర్బన్ డెవెలప్‌మెంట్, ఎన్‌సీసీ, రిజిస్ట్రర్ కోఆపరేటివ్ సొసైటీస్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్, ఆఫీస్ ఆఫ్ ది లోకాయుక్తా, డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, సాహిత్య కళా పరిషత్ వంటి విభాగాల్లో మొత్తం 714 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జనవరి 15, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 15, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
పరీక్ష విధానం ఇలా..
జనరల్ అవేర్‌నెస్, రిజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ల నుంచి 200 అబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




