Renu Desai: ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పార్టిసిపేట్ చేస్తోంది. ప్రత్యేకించి పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తోంది.
గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది రేణూ దేశాయ్. అంతకు ముందు చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఆమె ఇందులో కీలక పాత్ర పోషించింది. తన పాత్రకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు విడుదలై కూడా ఏడాది గడిచింది. ఇప్పటివరకు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదీ అందాల తార. సినిమాల విషయం పక్కనపెడితే రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజి బిజీగా ఉంటోంది. అనాథ పిల్లలు, పర్యావరణం, మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తుంటుంది. అలాగే తన ఫాలోవర్స్‌ని కూడా ఈ మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉంటుంది. కాగా జంతు ప్రేమికురాలైన రేణూ దేశాయ్ క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం తన కూతురు ఆద్య పేరు మీదగా ఒక ఎన్‌జీవోను కూడా స్థాపించింది. అలా మూగ జీవాలను కూడా సొంత మనుషుల్లా చూసుకునే రేణూ దేశాయ్ కు ఒక వ్యక్తి చేసిన పని తో చిర్రెత్తుకొచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోను ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది రేణూ దేశాయ్. అందులో ఒక వ్యక్తి ఒక చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో కనిపించాడు. దీనిని గమనించిన కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ పెట్టి ప్రశ్నించింది.
మూగ జీవాలతో రేణూ దేశాయ్ కూతురు ఆద్య..
View this post on Instagram
రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దుతుగా కామెంట్లు పెట్టారు. ఇలా జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించాలంటూ కోరారు.
మూగ జీవాలతో రేణూ దేశాయ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.