AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani: రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మహిళ మృతి.. 178 మందికి తీవ్ర అస్వస్థత!

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానిక రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) అనే మహిళ బిర్యానీ తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు కావడంతో..

Biryani: రెస్టారెంట్‌లో బిర్యానీ తిని మహిళ మృతి.. 178 మందికి తీవ్ర అస్వస్థత!
Food Poison
Srilakshmi C
|

Updated on: May 28, 2024 | 7:23 PM

Share

త్రిస్సూర్, మే 28: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్‌కు వచ్చి ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. స్థానిక రెస్టారెంట్‌లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రిలో చేరారు. వీరిలో కుటిలక్కడవ్‌కి చెందిన నుసైబా (56) అనే మహిళ బిర్యానీ తిన్న తర్వాత కడుపునొప్పి, వాంతులు కావడంతో ఆమెకు త్రిసూర్ మెడికల్ కాలేజీలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గత కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఫుడ్ పాయిజన్‌ కారణంగానే ఆమె మరణించిందంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

మరో వైపు సదరు రెస్టారెంట్‌లో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు, పంచాయతీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేరళలోని మాంసాహార రెస్టారెంట్లలో ‘కుజిమంతి’ అనే బిర్యానీ టైప్‌లో ఉండే వంటకం చాలా ఫేమస్‌. అన్నం, మాంసంతో కూడిన ఈ వంటకంతోపాటు మయోనీస్‌ వడ్డించడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత అధికారులు రెస్టారెంట్‌ను సీలు చేశారని కైపమంగళం పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

పంచాయతీ ప్రెసిడెంట్ వినీతా మోహన్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పెరింజనం, కైపమంగళం ప్రాంతాలకు చెందినవారు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు . వీరిలో మరికొందరు కొడంగల్లు, ఇరింగలకుడలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆరోగ్య శాఖ , పంచాయతీ, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్‌లోని ఆహార నమూనాలను టెస్టుల నిమిత్తం ల్యాబ్‌కు తరలించాం. రెస్టారెంట్ అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. కాగా కేరళ ప్రభుత్వం ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనీస్‌ అనే వంటకాన్ని నిషేధించింది. అప్పట్లో అంజు శ్రీపార్వతి (20) యువతి రెస్టారెంట్‌లో మండి తిని మరణించడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!