AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bribery: లంచం తీసుకున్నాడనీ.. బ్యాంకు అధికారికి ఏకంగా మరణశిక్ష విధించిన కోర్టు..!

లంచం తీసుకోవడం మనదేశంలో చాలా మామూలు విషయంగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో అయితే అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాయి అక్కడి ప్రభుత్వాలు. తాగా చైనాలో ఓ బ్యాంకు అధికారి భారీ స్థాయిలో లంచం తీసుకున్నందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా మరణ దండన విధించింది. ఈ కేసులో సదరు బ్యాంకు మాజీ అధికారి దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం..

Bribery: లంచం తీసుకున్నాడనీ.. బ్యాంకు అధికారికి ఏకంగా మరణశిక్ష విధించిన కోర్టు..!
Sentenced To Death
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2024 | 7:48 PM

బీజింగ్‌, మే 29: లంచం తీసుకోవడం మనదేశంలో చాలా మామూలు విషయంగా పరిగణిస్తారు. అదే విదేశాల్లో అయితే అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాయి అక్కడి ప్రభుత్వాలు. తాగా చైనాలో ఓ బ్యాంకు అధికారి భారీ స్థాయిలో లంచం తీసుకున్నందుకు అక్కడి ప్రభుత్వం ఏకంగా మరణ దండన విధించింది. ఈ కేసులో సదరు బ్యాంకు మాజీ అధికారి దోషిగా తేలడంతో మరణశిక్ష విధిస్తూ తూర్పు చైనాలోని ఓ న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో అదే బ్యాంకుకు చెందిన మరో అధికారికి మూడేళ్ల క్రితం ఇదే కోర్టు మరణశిక్ష విధించింది. వివరాల్లోకెళ్తే..

చైనా హువారోంగ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (CHIH) అనే చైనా హువారోంగ్‌ అసెట్‌ మేనేజిమెంట్‌ ఆఫ్‌షోర్‌ కంపెనీలో బాయిటియాన్‌హుయ్‌ అనే వ్యక్తి గతంలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో అతను దాదాపు 151 మిలియన్‌ డాలర్లు లంచం తీసుకుని అనేక ప్రాజెక్టులకు అక్రమంగా అనుమతులు ఇచ్చాడు. ఇందులో 1.1 బిలియన్‌ యువాన్‌ (రూ.1264కోట్లు)లు లంచం రూపంలో ఆయన తీసుకున్నట్లు తేలింది. ఈ కేసును విచారించిన టియాంజిన్‌లోని కోర్టు మంగళవారం అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుడా అతని వ్యక్తిగత ఆస్తులను కూడా కోర్టు జప్తు చేసింది. గతేడాది నంబర్ 2లో ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతని అక్రమ సంపాదన మొత్తం రికవరీ చేసి రాష్ట్ర ఖజానాలో జమ చేయనున్నారు.

బెయ్‌ చర్యలను కోర్టు క్షమించరాని నేరంగా పరిగణించింది. అతను భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నాడని, ఫలితంగా దేశ ప్రజల ప్రయోజనాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు తీర్పు సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అతని నేరాలకు చిన్న శిక్షలు సరిపోవని, అవినీతి నిరోధక డ్రైవ్‌లో ఇప్పటికే చాలా మంది చైనా అధికారులను శిక్షించిటన్లు కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

దశాబ్దం క్రితం చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా అరుదుగా మరణశిక్షలు విధించారు. జిన్‌పింగ్‌ అధికారంలో ఉన్నప్పుడు CHIH (చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ (CHAM)) అనే ఆఫ్‌షోర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఏర్పడిన తర్వాత ఇద్దరికి మాత్రమే చైనా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. 2021 జనవరిలో అదే కోర్టు CHAM మాజీ ఛైర్మన్ లై జియోమిన్‌కి మరణశిక్ష విధించారు. 1.79 బిలియన్ యువాన్లు (USD 247 మిలియన్లు) లంచాలు తీసుకోవడం, 25.13 మిలియన్ యువాన్లు (USD 3.46 మిలియన్లు) కంటే ఎక్కువ విలువైన ప్రజా ఆస్తులను అపహరించడం వంటి నేరాల్లో లై దోషిగా తేలింది. శిక్ష విధించిన నెల తర్వాత అతన్ని ఉరితీశారు. ఇప్పుడు బెయ్‌కి రెండోసారి మరణశిక్ష విధించింది. చైనాలో చాలా నేరాల్లో అధిక శాతం నిందితులు తమ నేరాలను అంగీకరించారు. దీంతో వారికి మరణశిక్షలు రద్దు చేసి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.