Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh MP Case: బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు.. అపార్ట్‌మెంట్ సెప్టిక్‌ ట్యాంకులో దొరికిన మాంసం ముద్దలు!

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకూ ఆయన మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఒకటి కూడా దొరకలేదని చెబుతున్న ఇంటెలిజెన్స్‌ అధికారుల చేతికి కీలక ఆధారం దొరికింది. కోల్‌కతాలో ఎంపీ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లో దాదాపు మూడున్నర కిలోల మాంసం ముద్దలు లభ్యమయ్యాయి...

Bangladesh MP Case: బంగ్లాదేశ్‌ ఎంపీ హత్య కేసులో కీలక మలుపు.. అపార్ట్‌మెంట్ సెప్టిక్‌ ట్యాంకులో దొరికిన మాంసం ముద్దలు!
Bangladesh MP murder case
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2024 | 4:12 PM

కోల్‌కతా, మే 29: బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ (53) హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకూ ఆయన మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఒకటి కూడా దొరకలేదని చెబుతున్న ఇంటెలిజెన్స్‌ అధికారుల చేతికి కీలక ఆధారం దొరికింది. కోల్‌కతాలో ఎంపీ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లో దాదాపు మూడున్నర కిలోల మాంసం ముద్దలు లభ్యమయ్యాయి. ఆ మాంసం ముద్దలను పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ మాంసం ముద్దలు అన్వరుల్‌ అజీమ్‌కు చెందినవా.. కావా.. అనే సంగతి ఫోరెన్సిక్‌ పరీక్ష, డీఎన్‌ఏ టెస్టుల్లో బయటపడనుంది.

ఎంపీ అన్వరుల్‌ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని సెప్టిక్‌ ట్యాంక్‌ను ఇటీవల పశ్చిమ బెంగాల్‌ సీఐడీ బృందాలు తనిఖీ చేశాయి. అందులో మాంసపు ముద్దలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మూడున్నర కిలోల మాంసం ముద్దలు, కొన్ని వెంట్రుకలు అందులో లభ్యమైనట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎంపీ హత్యకు గురైన ఫ్లాట్‌లోని బాత్‌రూమ్‌ ద్వారా రక్తం మురుగునీటి పైపుల ద్వారా వెళ్లినట్లు తెలిపారు. మురుగునీటి పైపులైన్లు, సెప్టిక్‌ ట్యాంకును పరిశీలించగా మాంసపు ముద్దలు బయటపడినట్లు డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హరున్-ఆర్-రషీద్ తెలిపారు.

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ చికిత్స కోసం మే 12న కోల్‌కతాలోని తన స్నేహితుడికి చెందిన అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే మే 17 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లోకి దింపి, కోల్‌కతాలోని న్యూ టౌన్‌ అపార్టుమెంటులో గొంతు నులిమి చంపి, అనంతరం ఆయన మృదేహాన్ని ముక్కలుగా నరికి వివిధ ప్రాంతాల్లో విసిరికేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య చేసిన నిందితుల్లో ముగ్గురు ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఎంపీ హత్య అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి, వాటికి పసుపు, మసాలాలు కలిపి కోల్‌కతాలోని బాగ్జోలా కాలువ, ఇతర ప్రాంతాల్లో పడేసినట్లు నిందితులు తెలిపారు. నిందితుల సమాచారం మేరకు పోలీసులు ఆయన శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే వాటిని గుర్తించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతోపాటు, జంతువులు కూడా వాటిని తినే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో ఎంపీ స్నేహితుడు అక్తరుజ్జమాన్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతను ఖాట్మండు నుంచి దుబాయ్ మీదుగా అమెరికాకు పారిపోయినట్లు ఇన్వెస్టిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.