ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థికి కొత్త చిక్కులు.. కాన్వాయ్ ఢీకొన్న కేసులో తీవ్ర విమర్శలు..
రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ కొత్త చిక్కులు వచ్చాయి. యూపీలోని కైసర్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన తనయుడు కరణ్ భూషణ్ కాన్వాయ్ ఢీకొని గోండాలో ఇద్దరు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం కరణ్‌భూషణ్ పేరు లేదు. డ్రైవర్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కోవడంతో బ్రిజ్ భూషణ్‌ను పార్టీ పక్కన పెట్టింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌సింగ్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ కొత్త చిక్కులు వచ్చాయి. యూపీలోని కైసర్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆయన తనయుడు కరణ్ భూషణ్ కాన్వాయ్ ఢీకొని గోండాలో ఇద్దరు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. అయితే పోలీసు ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం కరణ్‌భూషణ్ పేరు లేదు. డ్రైవర్‌ను నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఇరుక్కోవడంతో బ్రిజ్ భూషణ్‌ను పార్టీ పక్కన పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. యూపీలోని గోండా చుట్టుపక్కలను జిల్లాల్లో ఆయనకు పట్టుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కరణ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా..? ఒక్క వ్యక్తి ముందు లొంగిపోయిందా..? అని రెజ్లర్లు ప్రశ్నించారు.
మోటార్‌సైకిల్‌పై వెళుతున్న రెహాన్ ఖాన్ (17), అతని బంధువు షెహజాద్ ఖాన్ (20)లను స్కూల్ సమీపంలో కరణ్ వాహనం ఢీకొట్టిందని కెర్నల్‌గంజ్ సీఐ నిర్భయ్ నారాయణ్ సింగ్ తెలిపారు. గాయపడిన మహిళ, సీతాదేవి (60) ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ తరుణంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసు సిబ్బందిని ఆ ప్రాంతంలో మోహరించారు. యాక్సిడెంట్ చేసిన వాహనం UP32HW1800, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విద్యా సంస్థ పేరు మీద రిజిస్టర్ అయినట్లు తెలిపారు. యాక్సిడెంట్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డ్రైవర్ లవకుశ్, శ్రీవాస్తవను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కరణ్ పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. కరణ్‌భూషణ్ కూడా తండ్రి దారిలోనే వెళ్తున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తాజా యాక్సిడెంట్ కేసు నిదర్శనమని టీఎంసీ విమర్శించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..