Dip Gold and silver Prices: భారీగా దిగొచ్చిన బంగారం.. అంతర్జాతీయంగా బంగారం – వెండి తగ్గుబాటు.
అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు తగ్గాయి. గరిష్ఠాన్ని తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు .. అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల పలికింది. ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం.
అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు తగ్గాయి. గరిష్ఠాన్ని తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు .. అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల పలికింది. ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో గరిష్ఠంగా 2449 డాలర్లకు కూడా చేరింది. అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున, మన దేశం మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు పతనమవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం రాత్రి 11 గంటల సమయానికి 74,400 రూపాయలు పలికింది. గత సోమవారం ఈ ధర 76,750 రూపాయలుగా ఉంది. అంటే 2250 రూపాయలు తగ్గింది. ఇటీవల గరిష్ఠ ధర 77,150 రూపాయలుగా ఉంది. అదే విధంగా వెండి కిలో ధర 92,000 రూపాయల స్థాయికి దిగి వచ్చింది. సోమవారం ఈ ధర 96,000 రూపాయల స్థాయిలో ఉంది. అంటే 4,000 రూపాయలు తగ్గింది. ఈక్విటీ మార్కెట్లలోకి మదుపర్ల నిధులు ఇలానే కొనసాగితే, బంగారం 10 గ్రాముల ధర రూ.73,000 స్థాయికి, వెండి కిలో రూ.86,000 స్థాయికి దిగి రావచ్చని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
తల్లి ప్రేమకు నోచుకోని చిట్టి కోతి.. బొమ్మతోనే తన బంధం
ఈ దేశం ప్రజలకు 'దోసకాయలు' మరింత ప్రియం..
ట్యాబ్లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

