Snakes: బాత్రూమ్‌లో గుట్టలు గుట్టలుగా పాములు.. భయంతో ఇంటివాళ్లు పరుగు..

అసోంలోని నాగావ్ జిల్లాలో కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి వారు హడలిపోయారు. ఒకటి బయటకు వెళ్లిపోయిన తర్వాత డోర్‌ ఓపెన్‌ చేసి చూడగా దెబ్బకు షాకయ్యారు ఆ ఇంటి యజమానులు. బాత్రూమ్‌లో ఏకంగా ఓ 30 వరకూ పాములు కనిపించాయి. భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు.

Snakes: బాత్రూమ్‌లో గుట్టలు గుట్టలుగా పాములు.. భయంతో ఇంటివాళ్లు పరుగు..

|

Updated on: May 30, 2024 | 9:12 PM

పామును దూరం నుంచిచూస్తేనే భయంతో హడలిపోతాం. వెనక్కి తిరిగి చూడకుండా పరుగుతీస్తాం. అలాంటిది ఇంట్లోనే పాము తిష్ట వేస్తే.. పాము కాదు ఏకంగా పాముల గుట్టే.. ఓ ఇంట్లోని బాత్రూమ్‌లో దర్శనమిచ్చి ఆ ఇంటివారిని పరుగులు పెట్టించింది. ఈ ఘటన అసోంలో చోటుచేసుకుంది. అసోంలోని నాగావ్ జిల్లాలో కలియాబోర్ ప్రాంతంలోని ఓ ఇంటి బాత్రూం నుంచి పాము పిల్లలు బయటికి వస్తుండడాన్ని గమనించిన ఆ ఇంటి వారు హడలిపోయారు. ఒకటి బయటకు వెళ్లిపోయిన తర్వాత డోర్‌ ఓపెన్‌ చేసి చూడగా దెబ్బకు షాకయ్యారు ఆ ఇంటి యజమానులు. బాత్రూమ్‌లో ఏకంగా ఓ 30 వరకూ పాములు కనిపించాయి. భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఆనోటా ఈ నోటా విషయం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు ఈ విషయం స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అతడు వెంటనే అక్కడికి చేరుకుని ఆ బాత్రూం నుంచి పాము పిల్లలన్నింటినీ బయటికి తీసుకువచ్చాడు. వాటిని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అవి విష సర్పాలు కాదని, సాధారణ నీటి పాములు అని స్నేక్‌ క్యాచర్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us