AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

Phani CH
|

Updated on: May 30, 2024 | 5:34 PM

Share

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత షాక్ తగిలింది. అప్పటి వరకూ అమ్మాయిలా వయ్యరాలు ఒలకబోసిన మనిషి అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఉదంతం. ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది.

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇండోనేషియా యువకుడికి 12 రోజుల తర్వాత షాక్ తగిలింది. అప్పటి వరకూ అమ్మాయిలా వయ్యరాలు ఒలకబోసిన మనిషి అమ్మాయే కాదని, తన ఆస్తి కాజేయడానికి వేషం మార్చి పెళ్లి చేసుకున్న యువకుడని తెలియడంతో కంగుతిన్నాడు. పోలీసులను ఆశ్రయించి ఈ మోసాన్ని బయటపెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఉదంతం. ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఇద్దరూ ఓ హోటల్ లో కలుసుకున్నారు. బురఖాతో హాజరైన అడిండాను చూసి సంప్రదాయం పాటిస్తోందని మురిసిపోయాడు. పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. సంతోషంగా ఒప్పుకున్న అడిండా.. తనకు నా అనేవాళ్లు లేరని, ఒంటరినని చెప్పింది. దీంతో తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఏకే ఈ నెల 12న ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత కూడా అడిండా బురఖా తీయలేదు. నిత్యం బురఖాలోనే ఉండడం, తన ఇంట్లో వాళ్లతో దూరంగా మెసలడంతో అనుమానం వచ్చినా కొత్త పెళ్లికూతురు సిగ్గుపడుతోందని ఏకే భావించాడు. తనకు పీరియడ్స్ అని చెప్పి అడిండా భర్తను కూడా దూరంపెట్టింది. రోజులు గడిచినా రాత్రిపూట దూరంగా ఉండడంతో అనుమానించిన ఏకే.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అడిండా అసలు అమ్మాయే కాదని, అమ్మాయిలా నటించిన అబ్బాయని తేలింది. అడిండా అసలు పేరు ఈష్ అని, అతడి తల్లిదండ్రులు బతికే ఉన్నారని బయటపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా

పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..

అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??