అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా
అమెరికా తాజాగా ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బీ-21 రైడర్ యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దాని ఫొటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన చిత్రాలవి. రాడార్ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే ‘స్టెల్త్ బాంబర్’ కావడం విశేషం.
అమెరికా తాజాగా ఓ అత్యాధునిక యుద్ధ విమానానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బీ-21 రైడర్ యుద్ధ విమానాన్ని ప్రయోగాత్మకంగా నవంబర్ 2023లో తొలిసారి పరీక్షించారు. తాజాగా దాని ఫొటోలు బయటకు వచ్చాయి. కాలిఫోర్నియాలో ఎడ్వర్డ్స్ వైమానిక స్థావరంలో పరీక్షిస్తున్నప్పుడు తీసిన చిత్రాలవి. రాడార్ సహా శత్రుదేశాల అత్యాధునిక సాంకేతికతకు సైతం చిక్కకుండా ఎగరగలిగే ‘స్టెల్త్ బాంబర్’ కావడం విశేషం. అమెరికా వాయుసేనకు వెన్నెముకగా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానంగా దీన్ని అభివర్ణిస్తుండడం గమనార్హం. వచ్చే ఏడాది ఇది విధుల్లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగానే బీ-21 రైడర్ పనిచేస్తోందని ఇటీవల సెనేట్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్ వెల్లడించారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది సాధారణ పేలుడు పదార్థాలతో పాటు అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లేలా రూపొందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..
అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

