అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??

బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అందులోని సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.. టెర్మినల్ దగ్గరున్న విమానాన్ని ప్రొటోకాల్ మేరకు దూరంగా తరలించారు. ఎమర్జెన్సీ ద్వారాలు తెరిచి ప్రయాణికులను హడావుడిగా దించేశారు. విమానంలో నుంచి భయం భయంగా పరుగులు పెడుతూ దిగుతున్న ప్రయాణికులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??

|

Updated on: May 30, 2024 | 5:10 PM

బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అందులోని సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.. టెర్మినల్ దగ్గరున్న విమానాన్ని ప్రొటోకాల్ మేరకు దూరంగా తరలించారు. ఎమర్జెన్సీ ద్వారాలు తెరిచి ప్రయాణికులను హడావుడిగా దించేశారు. విమానంలో నుంచి భయం భయంగా పరుగులు పెడుతూ దిగుతున్న ప్రయాణికులకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ కు సిద్ధమైంది. మరికొద్ది నిమిషాల్లో రన్ వే పైకి చేరుకుని, గాల్లోకి ఎగరనుంది. ఇంతలో ఎయిర్ పోర్ట్ కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి విమానంలో బాంబు పెట్టామని హెచ్చరించాడు. ఫ్లైట్ లోని బాత్ రూమ్ లో చూడాలని సూచించాడు. దీంతో పైలట్ బాత్ రూమ్ లో చూడగా.. మరో 30 నిమిషాల్లో ఈ విమానం పేలిపోతుందని రాసిన ఓ కాగితం కనిపించింది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది సదరు విమానాన్ని ఎయిర్ పోర్ట్ లోని ఐసోలేషన్ ఏరియాకు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Coconut Flour: కొబ్బరి పిండితో రోటీ చేసి తింటే.. డబుల్‌ బెనిఫిట్

మరోసారి అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. ఈసారి ఎక్కడో తెలుసా ??

పంజాబ్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ !! నెట్టింట వైరల్ గా మారిన వీడియో

Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది

Follow us
Latest Articles