మరోసారి అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. ఈసారి ఎక్కడో తెలుసా ??

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అతను ఈ ఏడాది జూలైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. అయితే అంతకు ముందు అంబానీ కుటుంబం వధూవరుల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను వారి తాతగారి ఊరులో నిర్వహించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మరోసారి ఈ జంటకు ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించనున్నారు.

మరోసారి అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. ఈసారి ఎక్కడో తెలుసా ??

|

Updated on: May 29, 2024 | 1:14 PM

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. అతను ఈ ఏడాది జూలైలో తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. అయితే అంతకు ముందు అంబానీ కుటుంబం వధూవరుల కోసం గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను వారి తాతగారి ఊరులో నిర్వహించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా మరోసారి ఈ జంటకు ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిర్వహించనున్నారు. దీని కోసం అనంత్‌-రాధిక ఇద్దరూ ఫ్లైట్ ఎక్కారు. ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. ఇప్పుడు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈసారి ప్రీ వెడ్డింగ్‌ వేడుక ఎక్కడో తెలుసా? ఇటలీలో క్రూయిజ్‌లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసి ముఖేష్ అంబానీ తన కొడుకు, కాబోయే కోడలు కోసం సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రూయిజ్ ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు ప్రయాణిస్తుంది. ఈ సమయంలో అంబానీ కుటుంబం సముద్రం మధ్యలో ఈ వేడుక జరుపుకుంటారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ రెండవ ప్రీ-వెడ్డింగ్ కార్డ్ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో ఫంక్షన్ మే 29 నుండి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతుందని ఉంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ఈ కార్డును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ కార్డు ప్రకారం, అతిథులందరూ ఇటలీలోని సిసిలీలోని పలెర్మోలో ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరు కావాలి. మే 29న అందరూ కలిసి క్రూయిజ్‌లో చేరతారు. ఈ సమయంలో క్రూయిజ్‌లోని ఫంక్షన్‌లు వెల్‌కమ్ లంచ్ థీమ్‌తో ప్రారంభమవుతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంజాబ్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ !! నెట్టింట వైరల్ గా మారిన వీడియో

Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది

‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్

డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో

Follow us