Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ఆ స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా సలార్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

|

Updated on: May 29, 2024 | 1:10 PM

బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ ఆ స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న సినిమా సలార్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధికి వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ స్టార్ట్ అవుతుందా అని ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇటీవల కొన్ని రూమర్స్ టెన్షన్ కలిగించాయి. సలార్ 2 ప్రాజెక్ట్ ఆగిపోయిందని నెట్టింట ప్రచారం నడిచింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయని.. దీంతో సలార్ 2 ప్రాజెక్ట్ రద్దు అయ్యిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఆ రూమర్స్ పై నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పందించింది. సలార్ సెట్స్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ నవ్వుతూ కనిపించిన ఫోటోను షేర్ చేస్తూ.. వీరు నవ్వకుండా ఉండలేరు అంటూ పరోక్షంగా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో రాబోయే సలార్ 2 ప్రాజెక్టుకు శౌర్యాంగ పర్వం టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇదివరకే మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 27న డార్లింగ్ నటిస్తున్న కల్కి ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది చిత్రయూనిట్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది

‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్

డ్రైవర్ మాట నమ్మి.. రూ.వందల కోట్లు నష్టపోయిన హీరో

Hema: అందర్నీ ఫిదా చేస్తోన్న.. హేమ గ్రేట్ లవ్‌ స్టోరీ

TOP 9 ET News: కేజీఎఫ్ ఫార్ములాను ఫాలో అవుతున్న పుష్ప రాజ్ | అడ్డంగా దొరికిపోయిన రష్మిక

Follow us
Latest Articles