Coconut Flour: కొబ్బరి పిండితో రోటీ చేసి తింటే.. డబుల్‌ బెనిఫిట్

Coconut Flour: కొబ్బరి పిండితో రోటీ చేసి తింటే.. డబుల్‌ బెనిఫిట్

Phani CH

|

Updated on: May 29, 2024 | 1:16 PM

ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి వివిధ రకాల ఎంపికలను అవలంబిస్తున్నారు. సాధారణంగా మనం గోధుమ పిండితో రోటీలు చేసుకుని తింటాం. ఇది కాకుండా కొందరు జొన్నలు, రాగి పిండిని ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, మరొక మంచి ఎంపిక కూడా చేరింది..

ఆధునిక కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. తమ ఆహారాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి వివిధ రకాల ఎంపికలను అవలంబిస్తున్నారు. సాధారణంగా మనం గోధుమ పిండితో రోటీలు చేసుకుని తింటాం. ఇది కాకుండా కొందరు జొన్నలు, రాగి పిండిని ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంలో, మరొక మంచి ఎంపిక కూడా చేరింది.. అదే.. కొబ్బరి పిండి. మీరు గోధుమ పిండితో చేసిన రోటీలను తింటూ ఉండవచ్చు.. కానీ మీరు ఎప్పుడైనా కొబ్బరి పిండితో చేసిన రోటీలను రుచి చూశారా?.. మస్త్ గా ఉంటాయని.. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.. కొబ్బరి పిండి గోధుమ పిండికి గ్లూటెన్ రహిత ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతోంది. కొబ్బరి పిండిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఇప్పడు చూద్దాం. కొబ్బరి పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.. మలబద్ధకం,తిమ్మిరి వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.బరువు తగ్గాలనుకునేవారికి కూడా కొబ్బరి పిండి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ మొత్తంలో కేలరీలు, కొవ్వు ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది కడుపు నిండుగా ఉంచుతుంది.. ఇంకా ఆహారం తినాలనే కోరికను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. అంటే అకస్మాత్తుగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. మధుమేహ రోగులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి పిండిలో ఉండే లారిక్ యాసిడ్ , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి పిండి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ కు మంచి మూలం.. అంతేకాకుండా తక్షణ శక్తిని అందిస్తాయి. వీటన్నింటితో పాటు కొబ్బరి పిండితో శరీరానికి కావాల్సిన పోషకాహారం పూర్తిగా అందుతుంది. ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ పిండిని ఉపయోగించే ముందు.. దీర్ఘకాల వ్యాధులు, పలు ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రం వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరోసారి అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుక.. ఈసారి ఎక్కడో తెలుసా ??

పంజాబ్ లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ !! నెట్టింట వైరల్ గా మారిన వీడియో

Salaar: ఈ విషయం తెలిస్తే.. మీరు నవ్వకుండా ఉండలేరు

చిన్న వాదన.. ఆ స్టార్ నటుడి ప్రాణం బలితీసుకుంది

‘ఎవరో ఎక్కడికో వెళితే నాకేంటి సంబంధం’ మంచు లక్ష్మి సీరియస్