Diabetes Treatment: షుగర్ వ్యాధికి చైనా మందుతో చెక్.. తక్కువ టైంలోనే..

ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు 54 కోట్లమందికి నిజంగా గుడ్ న్యూస్. కేవలం మన దేశం విషయానికే వస్తే ఏకంగా 7 కోట్ల 70 లక్షల మందికి ఇది నిజంగా గుండెలపై చెయ్యి వేసుకొని నిద్రపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న భరోసా ఇచ్చే వార్తే. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 40లక్షల మంది ప్రాణాలు తీస్తున్న ఆ వ్యాధికి ఇక రోజులు దగ్గరపడ్డట్టే కనిపిస్తోంది. ఇన్సులిన్ అవసరం ఉండదు, రివర్స్ డయాబెటీస్ వీడియోలు చూడాల్సిన పన్లేదు, ఆన్ లైన్ క్లాసులకు హాజరుకానక్కర్లేదు.

Diabetes Treatment: షుగర్ వ్యాధికి చైనా మందుతో చెక్.. తక్కువ టైంలోనే..

|

Updated on: May 30, 2024 | 10:00 PM

ఇన్ని గణాంకాలు, ఇంత ఉపోద్ఘాతం .. ఇదంతా సైలెంట్‌ కిల్లర్ డయాబెటీస్ గురించే. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్‌తో బాధపడుతున్న వారికి చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సరికొత్త ఆశల్ని రెకెత్తిస్తోందనే చెప్పాలి. తాజాగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగంలో సంచలనం రేపుతోంది. 25 ఏళ్లుగా టైప్ 2 డయాబెటీస్‌తో బాధపడుతున్న 59 ఏళ్ల వయసున్న ఓ రోగికి సెల్ థెరపీ ద్వారా డయాబెటీస్‌ను పూర్తిగా నివారించగల్గామని చైనా వైద్యులు వెల్లడించినట్టు సౌత్ చైనా పోస్ట్ తెలిపింది. ఇప్పటి వరకు డయాబెటీస్ ఒకసారి సోకిందంటే జీవితాంతం దాంతో ఎలా సహజీవనం చెయ్యాలో వైద్యులు చెబుతూ వచ్చారు. బట్ చరిత్రలో తొలిసారిగా డయాబెటీస్‌ను పూర్తిగా లేకుండా చేశామని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి.

అసలెందుకు డయాబెటీస్ విషయంలో ఈ వార్త రాగానే యావత్ ప్రపంచం అంత ఆసక్తిగా చూసింది..? ఆ విషయానికొస్తే డయాబెటీస్ ప్రమాదంలో ముందున్న దేశాల్లో చైనా, ఆ తర్వాత భారత్ రెండూ ఉంటాయి. ఇంటర్నేషనల్ డయాబెటిసీ ఫౌండేషన్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక డయాబెటిసీ రోగులు ఉన్న దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్, భారత్ సెకెండ్‌ ప్లేస్‌లో ఉన్నాయి. చైనాలో సుమారు 14 కోట్ల మంది డయాబెటీస్ రోగులుండగా, భారత్‌లో ఇంతకుముందే చెప్పుకున్నట్టు సుమారు 7 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు. ఇండియాలో ప్రిడయాబెటిస్ స్టేజ్‌లో ఉన్న వారి సంఖ్య సుమారు రెండున్నర కోట్లు, ఇక తమకు డయాబెటీస్ ఉందన్న విషయమే తెలీకుండా.. ఇతర రోగాలకు చికిత్స తీసుకునే సమయంలో తెలుసుకొని అప్పుడు కంగారు పడుతున్న వారి సంఖ్య సుమారు 50 శాతం అంటే కోటి పాతిక లక్షల వరకు ఉంటోంది. అందుకే చైనా శాస్త్రవేత్తలు ఈ వార్త ప్రకటించిన వెంటనే ఇండియన్ మీడియా కూడా బాగా హైలెట్ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
ఆ స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశాడా..? అప్పుడే..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
శత్రువులను ఓడించడానికి చాణక్యుడి చెప్పిన విషయాలు పాటించి చూడండి..
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
తలపొగరోడు అందించిన క్యాచ్.. మిస్ చేసిన పంత్.. రోహిత్ కోపం చూశారా?
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
ఎమ్మెల్యేలు, నేతలు చేజారకుండా బీఆర్ఎస్ పక్కా ఫ్లాన్..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
బీర్‌ తాగితే కొలెస్ట్రాల్ మైనంలా కరిగిపోతుందట..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
కాంగ్రెస్ - బీఆర్ఎస్ నేతల చిచ్చు రాజేసిన బూడిద..!
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
బంగ్లాపై థ్రిల్లింగ్ విక్టరీ.. సెమీస్ చేరిన ఆఫ్గాన్..
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
రాజస్థాన్‌లో జలపాతాలు.. వర్షాకాలంలో వీటి అందాలు కనులకు విందు
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
ఏంటీ.. ఈ అమ్మాయి జై బోలే తెలంగాణ మూవీ హీరోయినా..? గుర్తుపట్టలేం బ
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం
నీళ్లలో ఈదుతూ నదిని దాటుతున్న ఏనుగుల గుంపు.. అద్భుతమైన దృశ్యం