Chiranjeevi: దటీజ్ మెగాస్టార్.. జర్నలిస్ట్‌ ప్రాణం కాపాడిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోనే. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. చిరంజీవి బ్లడ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఇక కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టులకు ఆపన్న హస్తం అందించారు.

Chiranjeevi: దటీజ్ మెగాస్టార్.. జర్నలిస్ట్‌ ప్రాణం కాపాడిన చిరు

|

Updated on: May 30, 2024 | 5:55 PM

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరోనే. అందుకే ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. చిరంజీవి బ్లడ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారాయన. ఇక కరోనా లాంటి విపత్తుల సమయాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు అండగా నిలిచారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఓ సీనియర్ జర్నలిస్టులకు ఆపన్న హస్తం అందించారు. ఆస్పత్రిలో ఒక్క రూపాయి కట్టనివ్వకుండా అన్నీ తానై చూసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులు మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతైనా బాస్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. మెడికల్ టెస్టులు చేయించుకోగా హార్ట్ లో 80 శాతం బ్లాకులు ఉన్నట్లు తేలింది. ఆయన కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యాంజియో గ్రామ్ చేసి బైపాస్ చేయాలని సూచించారట. ఈ విషయంలో చిరంజీవిని సంప్రదించారు ప్రభు. వెంటనే స్పందించిన చిరంజీవి తనకు బాగా పరిచయమున్న స్టార్ హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేసి ప్రభుని అడ్మిట్ చేయించారట. ఆ ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేయాల్సిన పని లేకుండా.. కేవలం స్టంట్స్ వేసి సమస్యను క్లియర్ చేశారని తెలుస్తోంది. చికిత్స విషయంలో ప్రభుని ఆస్పత్రికి ఒక్క రూపాయి కూడా కట్టనివ్వకుండా అన్ని తానై చూసుకున్నారట చిరు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: రష్మికాకు స్పాట్ పెట్టిన ఆనంద్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో

ఆమె నా కూతురు కాదు.. అందరికీ షాకిచ్చిన ఒకప్పటి హీరోయిన్

నాగ్ రిజెక్ట్ చేసిన సినిమాతో.. పవన్‌ బంపర్ హిట్ !! ఆ సినిమా ఏంటో తెలుసా ??

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

Follow us