AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ...

Namitha: భర్తతో స్టార్ హీరోయిన్ విడాకులు !! క్లారిటీ…

Phani CH
|

Updated on: May 30, 2024 | 5:48 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నమిత. ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయ్యింది. బొద్దుగా మారడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సెకండ్ హీరోయిన్‌గా, ఐటెం గార్ల్‌గా.. కొన్ని సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ చేసింది.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ నమిత. ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో హీరోయిన్‏గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయ్యింది. బొద్దుగా మారడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో సెకండ్ హీరోయిన్‌గా, ఐటెం గార్ల్‌గా.. కొన్ని సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన నమితా.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఇక కెరీర్ స్లో అయిన టైంలోనే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమిత.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా నమిత వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. నమిత తన భర్తతో విడిపోతుందని.. త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం నడుస్తోంది. దీంతో డివోర్స్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. “నేను, నా భర్త విడిపోతున్నాం.. విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయినా ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. కొన్నిసార్లు మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం. అలాగే అలాంటి రూమర్స్ చూసి మేము బాధపడడం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది నమిత.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆస్తి కోసం అమ్మాయి వేషం- అబ్బాయితో పెళ్లి.. ఆ తర్వాత ??

ఫ్లైఓవర్‌ప నుంచి వాహనదారులపై ఊడిపడ్డ పైప్‌ లైన్

అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాన్ని చూశారా

పేదల పిల్లలే వాళ్ళ టార్గెట్.. అపహరించటం.. విక్రయిచటం..

అరగంటలో విమానం పేలిపోతుందని బాత్రూమ్ లో కాగితం !! చివరికి ??

Follow Us