Bus Accident: ఘోర ప్రమాదం.. 150 అడుగుల లోయలో పడిపోయిన బస్సు! 21 మంది మృతి

జమ్ము-కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యాణాలోని కురుక్షేత్ర నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు జమ్ములోని అఖ్నూర్ వద్దకు రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది. రోడ్డుపై నుంచి దాదాపు 150 అడుగులో లోయలోకి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం..

Bus Accident: ఘోర ప్రమాదం.. 150 అడుగుల లోయలో పడిపోయిన బస్సు! 21 మంది మృతి
Akhnoor Bus Accident
Follow us

|

Updated on: May 30, 2024 | 6:09 PM

జమ్ము, మే 30: జమ్ము-కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందగా.. 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యాణాలోని కురుక్షేత్ర నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు జమ్ములోని అఖ్నూర్ వద్దకు రాగానే అదుపు తప్పి ఒక్కసారిగా లోయలో పడిపోయింది. రోడ్డుపై నుంచి దాదాపు 150 అడుగులో లోయలోకి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం కలిధర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జమ్మూలోని అఖ్నూర్ తాండా సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతోంది. శివ్ ఖోరీ ప్రాంతానికి యాత్రికులను తీసుకువెళుతుండగా ఈ ప్రమాం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ (జిఎంసి) ఆసుపత్రికి తరలించారు. అఖ్నూర్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు మృతదేహాలను తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్రు ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు. అఖ్నూర్‌ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు