ఈ షాపులపై తూనికల, కొలతల శాఖ ఫోకస్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అక్రమ వ్యాపారంతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టి వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి విలువలు లేకుండా అక్రమ సంపాదనే లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యాపారం చేస్తూ వినియోగదారుడి కంట్లో కారం కొట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఎన్నోసార్లు దాడులు చేసినా, పలు కేసులు కట్టినా కొంతమంది వ్యాపారులు తీరు మాత్రం ఇదంతా మామూలే అన్నట్లుగా ఉంది.
అక్రమ వ్యాపారంతో వినియోగదారుడి జేబుకు చిల్లు పెట్టి వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి విలువలు లేకుండా అక్రమ సంపాదనే లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యాపారం చేస్తూ వినియోగదారుడి కంట్లో కారం కొట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఎన్నోసార్లు దాడులు చేసినా, పలు కేసులు కట్టినా కొంతమంది వ్యాపారులు తీరు మాత్రం ఇదంతా మామూలే అన్నట్లుగా ఉంది. విచ్చలవిడిగా పెరుగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు లీగల్ మెట్రాలజీ నడుం బిగించింది. డిప్యూటీ కంట్రోలర్ కృష్ణ చైతన్య నేతృత్వంలో విజయవాడ, ఏలూరు జోన్ అధికారులు నగరంలోని పలు షాపులను తనిఖీ చేశారు. వివిధ బృందాలుగా విడిపోయి ఏకకాలంలో పలు షాపులపై సోదాలు నిర్వహించారు. షాపుల యజమానులు వివిధ పంధాలో మోసం చేస్తున్న తీరును చూసి అధికారులు అవాక్కయ్యారు.
తూకంలో మోసం, ఆహార ఉత్పత్తుల, వివిధ వస్తువులను ఆకర్షనీయంగా ప్యాకింగ్ చేసి ఎటు వంటి సమాచారం లేకుండా విక్రయాలు చేస్తున్న తీరును చూసి డిప్యూటీ కంట్రోలర్ సీరియస్ అయ్యారు. ఈ దాడులలో వివిధ షాపులు యజమానులు చేస్తున్న అక్రమాలు భారీగా బయటపడ్డాయి. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు, ఆయిల్ ప్యాకింగ్ ఏజెన్సీలు, సూపర్ మార్కెట్స్, రైతు బజారులు, కూరగాయల మార్కెట్లు, కిరాణా గొలుసు దుకాణాలను పెద్ద ఎత్తున పరిశీలించారు. దీంతో అనేక అక్రమాలు బయటపడ్డాయి. మోసాలను గుర్తించిన షాపులపై అధికారులు 29కేసులు నమోదు చేశారు. తూకం ఉల్లంఘనపై బస్టాండ్, గొల్లపూడి హోల్ సేల్ మార్కెట్లపై 3కేసులు, సూపర్ మార్కెట్లపై 6, రైతు బజారులు 9, ఆయిల్ ప్యాకింగ్ యూనిట్ పై 1కేసులను నమోదు చేశామని డిసి కృష్ణ చైతన్య తెలిపారు అక్రమ వ్యాపారం అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ దాడులలో అసిస్టెంట్ కంట్రోలర్లు, ఇన్స్పెక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..