Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలి.. హరిరామ జోగయ్య సూచన ఇదే..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ తరుణంలో.. పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరి రామజోగయ్య..తాజాగా మరో లేఖ సంధించారు. రానున్న ఎన్నికల్లో 41 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామజోగయ్య..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఈ తరుణంలో.. పోటీ చేయాల్సిన స్థానాలు, అభ్యర్థుల ఎంపికపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరి రామజోగయ్య..తాజాగా మరో లేఖ సంధించారు. రానున్న ఎన్నికల్లో 41 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్న హరిరామజోగయ్య.. ఆ స్థానాల్లో అభ్యర్థులను కూడా సూచించారు. ఆ స్థానాలపై టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని.. పొత్తులో భాగంగా దక్కించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు.. జోగయ్య. తిరుపతి నుంచి పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలని సూచించారు. మొత్తంగా.. ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని హరి రామజోగయ్య లేఖ ద్వారా పవన్‌ను కోరారు. రాష్ట్ర జనాభాలో 25 శాతం ఉన్న జనాభా ఉండి.. ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపులకు ఆయా స్థానాలు కేటాయించాలు లేఖలో సూచించారు.. హరిరామజోగయ్య..
ఎన్నికల నేపథ్యంలో పవన్‌కు కొంత కాలంగా వరుసగా లేఖలు రాస్తున్నారు జోగయ్య. ఈ పది రోజుల్లోనే 4 లేఖలు రాశారాయన. ఈ నెల 5న రాసిన లేఖలో టీడీపీ- జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జనాభా నిష్పత్తిలో జరుగుతోందా అని ప్రశ్నించారు. యాచించే స్ధాయి నుంచి శాసించే స్ధాయికి రావాలని కాపు కులస్తులు ఆలోచిస్తున్నారని.. పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా సీట్లను డిమాండ్ చేయాలంటున్నారు. జిల్లాల వారీగా అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా ఉండాలో లేఖల్లో సూచిస్తున్నారు రామజోగయ్య.
పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఓటర్లు 90 శాతం ఉండటంతో ఆ జిల్లాలో జనసేనకే ఎక్కువ సీట్లు కేటాయించాలని సూచించారు హరిరామ జోగయ్య. అలాగే జన సైనికుల బలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలన్నీ పార్టీ దక్కించుకోవాలన్నారు. ఆ సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే నష్టం టీడీపీ అనుభవించాల్సి వస్తుందని కూడా హరిరామజోగయ్య తన విశ్లేషణలో హెచ్చరిస్తున్నారు. అయితే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై స్పష్టమైన ప్రకటన ఇంకా విడుదల కాకముందే జోగయ్య రాస్తున్న లేఖలు ఆ పార్టీల్లో కలకలం రేపుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..