AP Rajya Sabha: ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో విచిత్రం.. పోటీలో ఎమ్మెల్యేల మద్దతు లేని అభ్యర్థి..!
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న మూడు స్థానాల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బరిలో నిలిచింది. ఆ పార్టీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు,మేడా రఘునాథ రెడ్డి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు మొదటి ఘట్టం పూర్తయింది. ఫిబ్రవరి 15తో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 8వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న మూడు స్థానాల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే బరిలో నిలిచింది. ఆ పార్టీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన ముగ్గురు అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు,మేడా రఘునాథ రెడ్డి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నప్పటికీ ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే సాధారణంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు మాత్రమే ఎప్పుడూ బరిలో ఉంటాయి. కానీ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ వేశారు. ఈయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కానీ నామినేషన్ల పరిశీలన సమయంలో ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీకి కనీసం పదిమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కానీ నామినేషన్ పత్రాల్లో ఎమ్మెల్యేలు ఎవరూ సంతకాలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు కోరేందుకు ప్రభాకర్ చంద్రబాబు నివాసానికి వెళ్లినప్పటికీ, ఆయనకు చంద్రబాబు అపాయింట్మెంట్ దక్కలేదు. మరోవైపు శుక్రవారం అంటే ఫిబ్రవరి 16వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్లు పరిశీలన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.
టీడీపీ పోటీకి దూరం.. ఏకగ్రీవం కానున్న మూడు ఎంపీ స్థానాలు
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరణగా ఉండటంతో వైఎస్సార్సీపీకి లైన్ క్లియర్ అయింది. ఈ ఏడాది రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ల పదవీ కాలం త్వరలో ముగుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూ రావుతో పాటు మేడా రఘునాథ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. రెండో సెట్ నామినేషన్ పత్రాలు కూడా అధికారులకు అందజేశారు.
అయితే తెలుగుదేశం బరిలో లేకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి పెమ్మసాని ప్రభాకర్ నామినేషన్ వేశారు. కానీ ఈయనకు ఒక్క ఎమ్మెల్యే మద్దతు కూడా లేదు…ఈ నెల 16 న నామినేషన్ల పరిశీలన సమయంలో ప్రభాకర్ నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంది ..దీంతో వైసీపీ ముగ్గురు అభ్యర్దుల ఎంపిక ఏకగ్రీవం కానుంది .అయితే అధికారిక ప్రకటన ఇక లాంఛనమే అవుతుంది .మరోవైపు తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోనుంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…