AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari: గోదావరి తీరంలో చేపల వేటకు వలలు కాదు.. తుపాకులు, కర్రలు కావాలట..!

ఒకప్పుడు గోదావరి తీరంలో చేపల వేట అంటే వలలు, పడవలు కావాలి.. ఇప్పుడైతే తుపాకులు, కర్రలు, కటారులు కావాలట. ఎందుకంటే అక్కడున్న స్థానిక మత్స్యకారులను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బెదిరించి చేపల ఎత్తుకెళ్తున్నారట. కొందరు ఏకంగా నాటు తుపాకీలతో బెదిరిస్తున్నారని ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తుతున్నారు.

Godavari: గోదావరి తీరంలో చేపల వేటకు వలలు కాదు.. తుపాకులు, కర్రలు కావాలట..!
Fishermen
B Ravi Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 15, 2024 | 5:16 PM

Share

ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రకృతి, పరవళ్లు తొక్కే గోదావరి అందాలు ఇదంతా నాణేనికి ఒక పక్క. కానీ రెండో వైపు ఇపుడు వివాదాలు గోదారిని పలకరిస్తున్నాయి. గోదావరి అందాలను వర్ణిస్తూ ఇప్పటికే ఎన్నో పుస్తకాల్లో రచయితలు గోదావరి నది ప్రాముఖ్యతను ఉన్నత స్థాయిలో ఉంచారు. అదే సమయంలో గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఎన్నో సినిమాలు దర్శకులు తెరకెక్కించారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్లే..! కానీ ప్రస్తుతం గోదావరి తీరం అక్రమ చేపల వేటకు అడ్డాగా మారిందని, వారికి రాజకీయ నాయకులు అండదండలు అందిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి.

ఒకప్పుడు గోదావరి తీరంలో చేపల వేట అంటే వలలు, పడవలు కావాలి.. ఇప్పుడైతే తుపాకులు, కర్రలు, కటారులు కావాలట. ఎందుకంటే అక్కడున్న స్థానిక మత్స్యకారులను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బెదిరించి చేపల ఎత్తుకెళ్తున్నారట. కొందరు ఏకంగా నాటు తుపాకీలతో బెదిరిస్తున్నారని ఆ ప్రాంతవాసులు బెంబేలెత్తుతున్నారు. ఎట్టకేలకు స్ధానిక మత్స్యకారులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు.

గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల నిర్వాసితులు గ్రామాలను వదిలి పునరావస కాలనీల్లో జీవిస్తున్నారు. దాంతో కొందరు మాత్రమే ఆ ప్రాంతంలో చేపల వేట సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అధికారులు ప్రాజెక్టు వెనుక భాగాన గత కొంతకాలం నుంచి స్థానిక మత్స్యకారులను నియంత్రించడంతో ఆ ప్రాంతంలో మత్స్య సంపద బాగా వృద్ధి చెందింది. అయితే, ఇదే అదునుగా కొందరు ఇతర ప్రాంతాల మత్స్యకారులు ఆ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి మకాం వేసుకుని దెయ్యపు వలలతో గోదావరి నదిలో చేపలను పట్టుకుంటున్నారు. అంతేకాదు, అడ్డు వచ్చిన వారిని నాటు తుపాకీలతో బెదిరిస్తూ వ్యాపారం దర్జాగా చేస్తున్నారని స్థానిక మత్స్యకారుల ఆరోపిస్తున్నారు.

కొందరు ఇతర ప్రాంతాల నుంచి మత్స్యకారులను తీసుకువచ్చి సుమారు 50 పడవలలో వందల మంది మత్స్యకారులు వేట సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మత్స్యకారులను వేటాడకుండా నియంత్రించిన అధికారులు ప్రాంతాల నుంచి వచ్చి దెయ్యపు వలలతో చేపలను వేటాడుతున్న వారిపై ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే అక్రమ చొరబాటుదారులకు రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. అంతేకాక రోజుకి సుమారు 15 టన్నుల చేపలు వేట ఆ ప్రాంతంలో జరుగుతుందని, పెద్ద చేపలు అయితే ఎండడానికి సమయం పట్టడంతో, గోస్ట్ వలలు ఉపయోగించి చిన్న చేపలను పట్టేస్తున్నారంటున్నారు.

ఇలా చిన్న చేపలను గోదావరి ఒడ్డున ఎండబెడుతూ, వాటిని బస్తాల్లోకి ఎత్తి కోళ్ల దాణా తయారు చేసే ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. అయితే, అధికారులు మాత్రం ప్రాజెక్టు వెనుక ప్రాంతంలో చేపల వేటకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అంతేకాక గతంలో నిర్వాసిత మత్స్యకారుల ఆందోళన దృష్ట్యా పగటి సమయంలో మాత్రమే వేటకు అనుమతించామని, అంతేకానీ అక్కడే ఉండి వేటాడేందుకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. అంతేకాక గోస్ట్ వలలతో గోదావరి నది తీరంలో చేప పిల్లల్ని పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అక్కడ నివాసముంటున్న ఇతర ప్రాంతాల మత్స్యకారులను ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోమని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..